- Home
- Sports
- Cricket
- బొగ్గు గని కార్మికుడి కొడుకు కాబట్టే ఇదంతా... వాళ్ల వల్లే ఉమేశ్ యాదవ్‌కి అన్యాయం! - దినేశ్ కార్తీక్
బొగ్గు గని కార్మికుడి కొడుకు కాబట్టే ఇదంతా... వాళ్ల వల్లే ఉమేశ్ యాదవ్‌కి అన్యాయం! - దినేశ్ కార్తీక్
అత్యంత వేగంగా స్వదేశంలో 100 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఉమేశ్ యాదవ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉమేశ్ యాదవ్ వ్యక్తిగత జీవితంలో రెండు భిన్నమైన అనుభూతులను మిగిల్చింది. ఈ సిరీస్ మధ్యలో తండ్రిని కోల్పోయిన ఉమేశ్ యాదవ్, ఆఖరి టెస్టుకి ముందు రోజు ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఉమేశ్ యాదవ్ భార్య తాన్యా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మిగిలిన క్రికెటర్ల మాదిరిగా పెటర్నిటీ లీవ్స్ పెట్టకుండా కూతురు పుట్టిన తర్వాతి రోజు మ్యాచ్ ఆడేందుకు అహ్మదాబాద్‌కి వచ్చేశాడు ఉమేశ్ యాదవ్...

ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమేశ్ యాదవ్, 3 వికెట్లు తీసి... స్వదేశంలో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఉమేశ్ యాదవ్ ఇప్పటిదాకా 13 ఏళ్ల కెరీర్‌లో 56 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు...
Image credit: PTI
‘ఉమేశ్ యాదవ్ చాలా కష్టాల నుంచి పైకి వచ్చాడు. అతని మూలాలను అర్థం చేసుకుంటే, ఉమేశ్ యాదవ్ కష్టాన్ని అర్థం చేసుకోవచ్చు. అతను ఓ బొగ్గు గని కార్మికుడి కొడుకు. పోలీస్ అకాడమీలో చేరాలని ఎంతో ప్రయత్నించాడు. అయితే అది వర్కవుట్ కాలేదు...
Image credit: PTI
అందుకే క్రికెట్‌పై ఫోకస్ పెట్టాడు. ఫాస్ట్ బౌలర్‌గా మారాడు. 2008లో విదర్భ టీమ్‌లోకి వచ్చిన ఉమేశ్ యాదవ్, 2010లో టీమిండియాలోకి వచ్చేశాడు. అంటే రెండేళ్లలోనే భారత జట్టు తరుపున ఆడగలిగాడు. ఎన్నో ఏళ్లుగా టీమ్‌లో ప్లేస్ ఆశిస్తున్నవారు ఉమేశ్ యాదవ్ ఎదుగుదలను చూసి షాక్ అయ్యారు..
అయితే టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఉమేశ్ యాదవ్ చాలా ఇబ్బందిపడ్డాడు. బాగా ఆడిన తర్వాత కూడా ఆ తర్వాతి మ్యాచుల్లో అవకాశం రాకపోతే ఏ ప్లేయర్ అయినా బాధపడతాడు. ఈ విషయంలో ఉమేశ్ యాదవ్ కూడా మినహాయింపు కాదు...
టీమ్‌లో ప్లేస్ దొరకకపోతే ఉమేశ్ యాదవ్ చాలా బాధపడతాడు. అవకాశం వచ్చిన ప్రతీసారీ ఉమేశ్ యాదవ్, రెండు- మూడు వికెట్లు తీస్తున్నాడు. అయితే ఆ వికెట్లు తీసిన తర్వాత కూడా అతనికి తర్వాతి మ్యాచుల్లో అవకాశం ఉండడం లేదు. తర్వాతి మ్యాచ్‌లో తనకి ప్లేస్ ఉండదని ఉమేశ్ యాదవ్‌కి తెలిసిపోతోంది...
సెలక్టర్ల వల్లే ఉమేశ్ యాదవ్‌కి అన్యాయం జరుగుతోంది. అతనికే కాదు, చాలా మంది సత్తా ఉన్న ప్లేయర్లు, ఎంత బాగా ఆడినా టీమ్‌లో ప్లేస్ ఉంటుందో ఉండదోనని భయపడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఇది వారి పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపిస్తోంది..
Umesh Yadav
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఉమేశ్ యాదవ్, తొలి రౌండ్‌లో అమ్ముడుపోలేదు. ఎంతో సత్తా ఉన్న సీనియర్ పేసర్‌ని ఫ్రాంఛైజీలు పట్టించుకోకపోతే... అది అతనికి ఘోర అవమానం. ఆ సంఘటన అతన్ని బాగా కలిచి వేసి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ వికెట్ కీపర్, కామెంటేటర్ దినేశ్ కార్తీక్...
ఐపీఎల్ 2022 సీజన్ మొదటి రౌండ్‌లో అమ్ముడుపోని ఉమేశ్ యాదవ్, రెండో రౌండ్‌లో బేస్ ప్రైజ్ రూ.1 కోటికి కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 2022 సీజన్‌లో 12 మ్యాచుల్లో 16 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్, కేకేఆర్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు... కేకేఆర్‌కి ఓపెనింగ్ స్పెల్స్ వేశాడు..