అవన్నీ బీసీసీఐ చూసుకుంటుంది... విరాట్ కోహ్లీ కామెంట్లపై సౌరవ్ గంగూలీ రియాక్షన్...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలు... బీసీసీఐ వర్సెస్ విరాట్ కోహ్లీగా అనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం... భారత క్రికెట్‌లో చిచ్చు రేపింది...

వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతోనే విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తప్పించారని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలియచేశాడు...
అంతేకాకుండా విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోకూడదని స్వయంగా తానే బ్రతిమిలాడనని, అయినా అతను వినలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది...
అయితే ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్న విరాట్ కోహ్లీ, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పినప్పుడు బీసీసీఐ బోర్డులో ఎవ్వరూ తనను అడ్డుకోలేదని కోహ్లీ చెప్పడంతో దుమారం రేగింది...
విరాట్ అబద్ధం చెప్పాడా? లేక కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంతో వస్తున్న ట్రోలింగ్‌ను అడ్డుకోవడానికి సౌరవ్ గంగూలీ మాట వరుసగా అలా చెప్పుకోచ్చాడా? అనేది తెలియాల్సి ఉంది...
భారత జట్టుకి అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీని ఎదురైన పరాభవాన్ని మాత్రం ఆయన ఫ్యాన్స్ సహించలేకపోతున్నారు...
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా కలిసి భారత క్రికెట్‌లో రాజకీయాలు చేస్తున్నారని, విజయాలు అందుకుంటున్నప్పుడు కెప్టెన్సీ మార్చాల్సిన అవసరం ఏముందని ట్రోల్స్ చేస్తున్నారు.
తాజాగా దీనిపై స్పందించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ‘ఇప్పుడు నేనేం కామెంట్ చేయలేను. బీసీసీఐ ఈ విషయాన్ని కరెక్టుగా డీల్ చేస్తుంది...’ అంటూ ముక్తాసరిగా సమాధానం ఇచ్చాడు...
విరాట్ కోహ్లీ ఇచ్చిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌తో అతనిపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారని, బోర్డుకి వ్యతిరేకంగా కామెంట్లు చేయడంపై సీరియస్‌గా ఉన్నారని సమాచారం...
ఇదే నిజమైతే సౌతాఫ్రికా టూర్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మెన్‌గా విఫలమైనా, కెప్టెన్‌గా విఫలమైనా అతని టెస్టు కెప్టెన్సీ కూడా పోవచ్చని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...
గత ఐదేళ్లుగా టెస్టు ఫార్మాట్‌లో భారత జట్టుకి అద్వితీయ విజయాలు అందిస్తూ, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలుపుతున్న విరాట్ కోహ్లీ, టెస్టు కెప్టెన్సీ కోల్పోతే... బీసీసీఐపై ట్రోలింగ్ మరింత తీవ్రం కావచ్చు....