- Home
- Sports
- Cricket
- ఆ నలుగురు లేకపోతే అంతేనా... స్టార్ ప్లేయర్లు లేకుండా టీమిండియా మ్యాచులు గెలవడం కష్టమేనా...
ఆ నలుగురు లేకపోతే అంతేనా... స్టార్ ప్లేయర్లు లేకుండా టీమిండియా మ్యాచులు గెలవడం కష్టమేనా...
ఐపీఎల్ 2022 సీజన్ నాటి సంగతి. సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా, మోహ్సీన్ ఖాన్... భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ప్లేయర్ల సంఖ్య చూసి క్రికెట్ ప్రపంచం షాక్ అయ్యింది. ఈజీగా రెండు జట్లతో ఆడి ఏ టీమ్‌నైనా ఓడించగలమని టైటిల్ విన్నర్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కామెంట్ చేశాడు...

ఐపీఎల్‌లో అదరగొట్టిన ప్లేయర్లను కలిపితే రెండు కాదు, బలమైన మూడు జట్లను కూడా తయారుచేయవచ్చని... వాటితో ఎలాంటి టీమ్‌కైనా చుక్కలు చూపించవచ్చని కామెంట్ చేశాడు హార్ధిక్ పాండ్యా...
అయితే ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా పర్ఫామెన్స్ చూస్తుంటే... పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. బ్యాటింగ్‌లో పరుగులు చేస్తున్నా, బౌలింగ్‌లో వికెట్లు పడుతున్నా... మ్యాచులు మాత్రం గెలవలేకపోతోంది భారత జట్టు...
రోహిత్ శర్మ కెప్టెన్సీలో స్వదేశంలో వరుసగా 17 మ్యాచుల్లో గెలుస్తూ వచ్చింది టీమిండియా. విదేశీ పిచ్‌లపై భారత్‌ని ఓడించిన న్యూజిలాండ్ వంటి టాప్ టీమ్స్‌ని కూడా స్వదేశంలో వణికించగలిగింది టీమిండియా. అలాగే సౌతాఫ్రికాకి చుక్కలు కనిపించడం ఖాయమనుకున్నారంతా..
ఈ ఉద్దేశంతోనే ఐపీఎల్ 2022 తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలకు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించింది టీమిండియా. కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ కూడా సిరీస్ ఆరంభానికి ముందు గాయంతో జట్టుకి దూరమయ్యారు...
సూర్యకుమార్ యాదవ్ గాయంతో టోర్నీకి ఎంపిక కాలేదు. ప్రస్తుత జట్టులో రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, యజ్వేంద్ర చాహాల్, భువనేశ్వర్ కుమార్ మినహా మిగిలిన ప్లేయర్లలో చాలా మంది పట్టుమని 10 మ్యాచులు ఆడిన అనుభవం కూడా లేని ప్లేయర్లే...
రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్‌లకు అంతర్జాతీయ అనుభవం చాలా తక్కువ. దీంతో సౌతాఫ్రికాకు టీమిండియాని ఓడించడం పెద్ద కష్టమేమీ కావడం లేదు. దానికి తోడు లక్ కూడా సఫారీ టీమ్ వైపే ఉంది...
Image credit: PTI
రెండు మ్యాచుల్లోనూ టాస్ ఓడిన భారత కెప్టెన్ రిషబ్ పంత్, పర్ఫామెన్స్‌లోనూ తన రేంజ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దీంతో రిజర్వు బెంచ్‌తో ఏ టీమ్‌నైనా ఓడించే సత్తా, భారత జట్టుకి లేదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
Image credit: PTI
దీనికి ముందు గత ఏడాది భారత జట్టు, ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో లంకలో పర్యటించింది మరో జట్టు. ఆ సమయంలో వన్డే సిరీస్ గెలిచి, కరోనా కేసుల కారణంగా టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో కోల్పోయింది...
Rishabh Pant
అప్పటిలా శిఖర్ ధావన్, సంజూ శాంసన్, పృథ్వీ షా, కృనాల్ పాండ్యా వంటి సీనియర్లకు సౌతాఫ్రికాతో సిరీస్‌లో అవకాశం ఇచ్చినా భారత జట్టు పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...