- Home
- Sports
- Cricket
- గ్రెగ్ ఛాపెల్ ఫార్ములాని ఫాలో అవుతున్న రాహుల్ ద్రావిడ్... బాగా ఆడినా సీనియర్లకు దక్కని చోటు...
గ్రెగ్ ఛాపెల్ ఫార్ములాని ఫాలో అవుతున్న రాహుల్ ద్రావిడ్... బాగా ఆడినా సీనియర్లకు దక్కని చోటు...
టీమిండియా క్రికెట్ చరిత్రలో హెడ్ కోచ్ గ్రెగ్ ఛాపెల్- సౌరవ్ గంగూలీ మధ్య జరిగిన గొడవల ఎపిసోడ్‌కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అప్పటిదాకా అరకొర విజయాలతో ఓ సాధారణ జట్టుగా ఉన్న భారత జట్టు, గ్రెగ్ ఛాపెల్ తప్పుకున్న తర్వాత అసాధారణ మార్పులతో టాప్ టీమ్‌గా ఎదిగింది...

<p>Greg Chappell</p>
టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్లు వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, మహ్మద్ కైఫ్ వంటి ప్లేయర్లను తుది జట్టులో నుంచి తప్పిస్తూ.. గ్రెగ్ ఛాపెల్ తీసుకున్న నిర్ణయాలు, అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి...
గ్రెగ్ ఛాపెల్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయన హయాంలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్ కూడా టీమిండియా కెప్టెన్సీకి రాజీనామా చేశాడు... ద్రావిడ్ తప్పుకున్న తర్వాత టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెస్ ధోనీ కూడా ఇదే ఫార్ములాని అనుసరించాడు...
ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో భారత సీనియర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్... ఇలా ఎందరో సీనియర్ క్రికెటర్లు... టీమ్‌లో చోటు కోల్పోయి ఫేర్‌వెల్ మ్యాచులు లేకుండానే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది...
ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రాహుల్ ద్రావిడ్ కూడా ఛాపెల్ ఫార్ములానే అనుసరిస్తున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో అదరగొట్టినా సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్‌కి టీ20 జట్టులో చోటు దక్కలేదు...
Image Credit: Getty Images
ఐపీఎల్‌లో వరుసగా 450+ స్కోర్లు చేస్తున్నా శిఖర్ ధావన్, టీ20ల్లో చోటు దక్కించుకోలేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏడాది క్రితం లంక టూర్‌లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన గబ్బర్, సౌతాఫ్రికాతో, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లకి ఎంపిక కూడా కాలేదు...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి యంగ్ టీమ్‌ని ఎంపిక చేయాలనే ఉద్దేశంలో శిఖర్ ధావన్‌ని పక్కనబెట్టిన రాహుల్ ద్రావిడ్, సీనియర్ పేసర్ మహ్మద్ షమీని కూడా టీ20లకు దూరంగా పెట్టాడు...
Wriddhiman Saha, Ishant Sharma
అలాగే వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ వంటి సీనియర్లు, టెస్టు టీమ్‌లో చోటు కోల్పోయారు. 100కి పైగా టెస్టులు ఆడి 300లకు పైగా వికెట్లు తీసిన ఇషాంత్ శర్మతో పాటు సీనియర్ వికెట్ కీపర్ సాహా మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోవడం అసాధ్యంగానే మారింది...
Cheteshwar Pujara, Ajinkya Rahane
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, వరుసగా ఫెయిల్ అవుతున్నా అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా వంటి సీనియర్లకు వరుస అవకాశాలు ఇస్తే... రాహుల్ ద్రావిడ్ ఎంట్రీతో ఈ ఇద్దరూ కూడా జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది...
టీమిండియా ‘నయా వాల్’గా గుర్తింపు తెచ్చుకున్న ఛతేశ్వర్ పూజారా, టెస్టు టీమ్‌లో తిరిగి స్థానం సంపాదించుకోవడం కోసం కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని, సెంచరీలు బాది ఫామ్‌ని నిరూపించుకోవాల్సి వచ్చింది... చూస్తుంటే రాహుల్ ద్రావిడ్ కోచింగ్ స్టైల్ కూడా ఛాపెల్‌ని పోలి ఉందని అంటున్నారు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్...
అప్పుడు గ్రెగ్ ఛాపెల్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమిండియా కెప్టెన్సీ నుంచి సౌరవ్ గంగూలీని తప్పిస్తే... ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాక టీమిండియా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం కొసమెరుపు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్‌గా వైదొలిగినా వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు విరాట్ కోహ్లీ. అయితే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో మనస్థాపం చెంది, టెస్టు కెప్టెన్సీకి కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు కోహ్లీ...