MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • ఛతేశ్వర్ పూజారా, రవీంద్ర జడేజా అవుట్, ఇషాంత్ శర్మకు రెస్ట్... మూడో టెస్టు బరిలో ఆ ఇద్దరు...

ఛతేశ్వర్ పూజారా, రవీంద్ర జడేజా అవుట్, ఇషాంత్ శర్మకు రెస్ట్... మూడో టెస్టు బరిలో ఆ ఇద్దరు...

రెండో టెస్టులో గెలిచి, టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించిన టీమిండియా... మూడో టెస్టులో మూడు మార్పులతో బరిలో దిగబోతున్నట్టు టాక్ వినబడుతోంది. మొదటి రెండు టెస్టుల్లో అద్భుతమైన ఆధిపత్యం చూపించినా... మూడో టెస్టులో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతోందట టీమిండియా...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 22 2021, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఫెయిల్ అయిన ఛతేశ్వర్ పూజారా, మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు మాత్రమే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 13 బంతుల్లో మూడు ఫోర్లతో 12 పరుగులు చేసి ఆకట్టుకున్నా.. వర్షం కారణంగా ఐదో రోజు ఆట సాధ్యం కాలేదు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి పెవిలియన్ చేరిన ఛతేశ్వర్ పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవడానికి 35 బంతుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది...

310

206 బంతులు ఎదుర్కొన్న పూజారా, 4 ఫోర్లతో 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ జిడ్డు బ్యాటింగ్‌తో ఇంప్రెస్ కాని టీమిండియా మేనేజ్‌మెంట్, అతన్ని మూడో టెస్టు నుంచి పక్కనబెట్టాలని యోచిస్తోందట...

410

పూజారా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ లేదా పృథ్వీషాను ఆడించాలని ఆలోచిస్తోంది బీసీసీఐ. ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఈ ఇద్దరూ...రెండో టెస్టులో మూడో రోజు నుంచి స్టేడియంలో మ్యాచ్ చూస్తూ కనిపించారు...

510

ఫామ్‌లో లేని పూజారాను ఆడించి, మరోసారి ఇబ్బంది పడేకంటే... ఫామ్‌లో ఉన్న పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లలో ఎవరినో ఒకరిని ఆడిస్తే, మంచి రిజల్ట్ దక్కుతుందని భావిస్తోంది టీమిండియా...

610

అలాగే బ్యాటింగ్‌లో రాణిస్తున్నా గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వికెట్ తీయలేకపోయిన రవీంద్ర జడేజా స్థానంలో భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఆడడం ఖాయంగా కనిపిస్తోంది...

710

రెండో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ ఆడాల్సి ఉన్నా, ఆఖరి నిమిషంలో అతనికి తుదిజట్టులో చోటు దక్కలేదు. మూడో టెస్టులో జడేజా స్థానంలో అశ్విన్ ఆడబోతున్నాడని, రెండు టెస్టుల్లో భారత ఫాస్ట్ బౌలర్లకు దొరకని జో రూట్‌ను నిలువరించేందుకు అశ్విన్‌ను అస్త్రంగా వాడాలని భావిస్తోందట బీసీసీఐ...

810

అలాగే రెండో టెస్టులో ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్న భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు కూడా మూడో టెస్టులో విశ్రాంతి ఇవ్వనున్నారట... 

910

ఇషాంత్ శర్మ స్థానంలో తొలి టెస్టులో ఆకట్టుకున్న స్వింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను తిరిగి జట్టులోకి తేవాలని టీమిండియా భావిస్తోందట. 

1010

శార్దూల్ ఠాకూర్ రీఎంట్రీతో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా పటిష్టంగా మారుతుందని ఆలోచిస్తోందట విరాట్ సేన...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved