అంబటి రాయుడి కోసమే కోహ్లీ-రోహిత్ ల మధ్య విభేదాలు...?

First Published 27, Jul 2019, 4:22 PM

టీమిండియా కెప్టెన్ విరాట్ కోోహ్లీ-రోహిత్ శర్మ ల మధ్య విబేధాలు తలెత్తినట్లు ఓ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అలా వారిమధ్య బేదభిప్రాయాలే రావడానికి తెలుగు క్రికెటర్ అంబటి రాయుడే కారణమట.   

టీమిండియా...ప్రస్తుతం అంతర్జాతీయ జట్లన్నింటితో పోలిస్తే బలంగా వున్న జట్టు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లోనూ టీమిండియా ఆటగాళ్లు రాణిస్తూ జట్టును అత్యున్నత స్థానంలో నిలబెట్టారు. ఇలాంటి సమయంలో భారత ఆటగాళ్ల మధ్య సమిష్టితత్వం లోపించి గ్రూపులుగా చీలిపోయారన్న వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

మరీముఖ్యంగా జట్టులో సీనియర్లు, అత్యంత కీలకమైన ఆటగాళ్లయిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య ఆదిపత్య పోరు సాగుతోందట. అందుకు ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కపే కారణంగా నిలించింది. ఈ టోర్నీలో కోహ్లీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను రోహిత్ వ్యతిరేకించాడని...అందువల్లే విబేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. అలా వారి మధ్య విబేధాలను సృష్టించినట్లు ప్రచారంలో వున్న నిర్ణయాలేమిటో తెలుసుకుందాం.

ప్రపంచ కప్ కోసం టీమిండియా ఇంగ్లాండ్ కు బయలుదేరక ముందే కోహ్లీ, రోహిత్ ల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయట. ముఖ్యంగా మంచి ఫామ్ లో వున్న అంబటి రాయుడిని కాదని సెలెక్టర్లు విజయ్ శంకర్ ని ఎంపిక చేయడంలో కోహ్లీ, రవిశాస్త్రిల ప్రమేయం వుందన్నది రోహిత్ అనుమానం. దీంతో రాయుడిని పక్కనపెట్టడాన్ని రోహిత్ తప్పుబట్టడంతో అభిప్రాయబేధాలు ప్రారంభమయ్యాయట.

ప్రపంచ కప్ మధ్యలో కూడా విజయ్ శంకర్ గాయంతో తప్పుకోవడం రోహిత్ రాయుడికి అవకాశమివ్వాలని కోరగా...కెప్టెన్, కోచ్ లు మాత్రం మయాంక్ అగర్వాల్ వైపు మొగ్గుచూపారు. దీంతో చివరకు సెలెక్టర్లు రాయుడిని కాదని మయాంక్ ను ఎంపిక చేశారు. ఇలా రాయుడు విషయంలో కోహ్లీ-రోహిత్ ల మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక యువ స్పిన్నర్ యజువేందర్ చాహల్ విషయంలో కూడా కెప్టెన్, వైస్ కెప్టెన్ మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. చాహల్ వరుసగా విఫలమవుతున్నా అతడికి మళ్లీ మళ్లీ అవకాశాలిస్తూ మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలను పక్కనపెట్టడం రోహిత్ కు నచ్చలేదట. దీంతో అతడు కోహ్లీకి తన అభిప్రాయాన్ని తెలియజేసినా పట్టించుకోలేదట. ఇది వీరిమధ్య దూరాన్ని మరింత పెంచింది.

మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ విషయంలోనూ వీరిమధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ధోని బ్యాటింగ్ ఆర్డర్ ను ముందుకు తీసుకువస్తే అతడు మరిన్ని పరుగులు సాధించడానికి ఆస్కారం వుంటుందన్నది రోహిత్ ఆలోచన. అయితే అతడు చివర్లో వుంటేనే టాప్ ఆర్డర్ విఫలమైనా ఆదుకుంటాడని కోహ్లీ ఆలోచన. ఇలా వీరిద్దరి తాపత్రయం టీమిండియా ప్రయోజనాల కోసమే. అయితే ఆలోచనా విధానాలే వేరుగా వుండటంతో బేదాభిప్రాయాలు తలెత్తాయి.

మరోవైపు విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలు ఏకమై తన అభిప్రాయాలకు అసలు విలువివ్వక పోవడం రోహిత్ కు నచ్చలేదు. దీంతో అతడు తనకు అనుకూలంగా వుండే ఆటగాళ్లతో ఓ వర్గంగా చీలిపోవడం... మిగతావారు కోహ్లీ వర్గంగా మారారట. ఇలా కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

loader