- Home
- Sports
- Cricket
- కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌తో సహా ఆ ఐదుగురు అవుట్... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి...
కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌తో సహా ఆ ఐదుగురు అవుట్... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోయే తుది 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది టీమిండియా. గబ్బా టెస్టులో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు మరో ముగ్గురికి నిరాశే ఎదురైంది.

కొన్నాళ్లుగా టెస్టుల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న కెఎల్ రాహుల్‌కి మరోసారి నిరాశే ఎదురైంది. కెఎల్ రాహుల్‌తో పాటు మయాంక్ అగర్వాల్‌ను కూడా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ నుంచి తీసి పక్కనబెట్టింది టీమిండియా.

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన అక్షర్ పటేల్‌కి కూడా ఫైనల్ ఆడే జట్టులో చోటు దక్కలేదు. అక్షర్ పటేల్‌ను సర్‌ప్రైజ్ స్పిన్నర్‌గా ఆడిస్తారని భావించినా, విదేశీ పిచ్‌లపై అనుభవం లేని అతన్ని ఫైనల్ మ్యాచ్‌లో ఆడించి, రిస్క్ చేయడానికి బీసీసీఐ సిద్ధంగా లేదని తెలుస్తోంది.

అతనితో పాటు గబ్బా టెస్టులో అటు బ్యాటుతో, బంతితో రాణించిన ఆల్‌రౌండర్లు శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌లను 15 మందితో కూడిన జట్టు నుంచి తప్పించింది టీమిండియా...

కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ తప్పుకోవడంతో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ రావడం ఖాయమైపోయింది....

వీరి తర్వాత ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే బ్యాటింగ్ ఆర్డర్‌లో తమ స్థానాలను నిలుపుకున్నారు. కౌంటీ క్రికెట్ ఆడిన హనుమ విహారి, రవీంద్ర జడేజాలలో ఒకరికి తుది 11 మంది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

రిషబ్ పంత్‌తో పాటు వృద్ధిమాన్ సాహాను కూడా తుదిజట్టుకి ఎంపికచేశారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల రిషబ్ పంత్ గాయపడితే, అతని స్థానంలో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా సాహా బరిలో దిగుతాడు.

జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మలతో పాటు ఉమేశ్ యాదవ్ కూడా బౌలర్ల కోటాలో చోటు దక్కించుకున్నాడు. అయితే ఉమేశ్ యాదవ్‌కి తుదిజట్టులో చోటు దక్కడం కష్టమే.

రవిచంద్రన్ అశ్విన్ తుదిజట్టులో ఉండడం ఖాయం. అతనితో పాటు రవీంద్ర జడేజాను అదనపు స్పిన్నర్‌గా, ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు కల్పిస్తారా? లేక ఇద్దరు స్పిన్నర్లు ఎందుకని, అతని స్థానంలో విహారిని ఆడిస్తారా? అనేది తేలాల్సి ఉంది.

మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. కొందరు 100 టెస్టులు అనుభవం కలిగిన ఇషాంత్ శర్మను ఫైనల్‌లో ఆడించాలని అంటుంటే, మరికొందరు ఈ మధ్యకాలంలో అద్భుతంగా రాణిస్తున్న సిరాజ్‌కి ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు.

ఫైనల్ ఆడే 15 మందితో కూడిన తుదిజట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, సిరాజ్