బాబర్ ఆజమ్ పక్కా సెల్ఫిష్ కెప్టెన్ అంటూ గౌతమ్ గంభీర్ కామెంట్... స్పందించిన వసీం అక్రమ్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్‌పై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. గత ఎడిషన్‌లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న బాబర్ ఆజమ్, ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్‌ని ఓడించిన మొట్టమొదటి పాక్ కెప్టెన్‌గా నిలిచాడు. అయితే ఏడాది తర్వాత సీన్ రివర్స్ అయ్యింది...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్, టీమిండియా చేతుల్లో ఆఖరి బంతికి ఓడింది. ఈ మ్యాచ్ తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 130 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక 1 పరుగు తేడాతో పరాజయం పాలైంది పాకిస్తాన్. ఈ రెండు పరాజయాలు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై విమర్శలు రావడానికి కారణమయ్యాయి.
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా బాబర్ ఆజమ్‌పై స్పందించాడు. ‘బాబర్ ఆజమ్ పక్కా సెల్ఫిష్ కెప్టెన్. కెప్టెన్‌గా ఉంటూ ఇంత స్వార్థంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తున్నాడు...
Babar Azam
ఓపెనర్‌గా వస్తే ఎక్కువ పరుగులు చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బాబర్ ఆజమ్ క్రియేట్ చేసిన రికార్డులన్నీ అలా వచ్చినవే. అయితే ఓ లీడర్‌గా ఆలోచిస్తే మాత్రం, నీ రికార్డుల కంటే టీమ్ విజయానికి ఏం అవసరమో అదే చేస్తావు...’ అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్.
Babar Azam
తాజాగా గంభీర్ కామెంట్లపై పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ స్పందించాడు. ‘బాబర్ ఆజమ్ కెప్టెన్సీ గురించి గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్లు నాకొంచెం ఆశ్చర్యాన్ని కలిగించాయి. గంభీర్ ప్రస్తుతం కామెంటరీలో ఉన్నాడు. ఫకార్ జమాన్‌ని ఓపెనర్‌గా ప్రమోట్ చేయాలని గంభీర్ చెప్పాడు...
Babar Azam -Mohammad Rizwan
అది అతని అభిప్రాయం. అందులో తప్పేమీ లేదు. గౌతమ్ గంభీర్ ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. కేకేఆర్‌కి రెండు సార్లు టైటిల్ అందించాడు. టీమిండియా టాప్ ప్లేయర్లలో ఒకడు. తన అభిప్రాయం అతను చెప్పాడు. అందులో తప్పేమీ లేదు...’ అంటూ వ్యాఖ్యానించాడు వసీం అక్రమ్..