టి నటరాజన్... టీమిండియా తరుపున 11వ బౌలర్... అరుదైన ఘనత క్రియేట్ చేసిన నట్టూ!

First Published Dec 2, 2020, 9:37 AM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన టి నటరాజన్... తన యార్కర్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఐపీఎల్ తర్వాతి క్రికెట్ సీజన్‌లో టీమిండియా తరుపున ఆడతాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. ఆసీస్ టూర్‌కి ఎంపికైన వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా తప్పుకోవడంలో అతని ప్లేస్‌లో లక్కీగా జట్టులోకి వచ్చిన నటరాజన్, మూడో వన్డేలో టీమిండియా తరుపున ఆడుతూ రికార్డు క్రియేట్ చేస్తున్నాడు. సైనీ భారీగా పరుగులు ఇవ్వడంతో నటరాజన్‌కి తుది జట్టులో అవకాశం దక్కింది.

భారత జట్టు కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య లెఫ్ట్ ఆర్మ్ సీమర్... ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్ తర్వాత ఆ రేంజ్‌లో ప్రదర్శన ఇచ్చిన లెఫ్ట్ ఆర్మ్ సీమర్‌ను టీమిండియా సెలక్టర్లు కనిపెట్టలేకపోయారు...

టీమిండియా వన్డే క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి 990 వన్డేల్లో కేవలం 11 మంది లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు మాత్రమే భారత జట్టు తరుపున ఆడారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

టీమిండియా తరుపున మొట్టమొదటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కర్సన్ గావ్రీ... టీమిండియా తరుపున 39 టెస్టులు ఆడిన గావ్రీ 109 వికెట్లు పడగొట్టారు. 19 వన్డేల్లో 15 వికెట్లు మాత్రమే తీయగలిగారు.

రుద్రప్రతాప్ సింగ్: టీమిండియా తరుపున ఇద్దరు ఆర్‌పీ సింగ్‌లు లెఫ్ట్ ఆర్మ్ సీమర్లుగా టీమిండియాకు ఆడారు. ధోనీ కెప్టెన్సీలో ఆడిన ఆర్‌పీ సింగ్ 1985లో పుడితే, ఈ ఆర్‌పీ సింగ్ 1986లో టీమిండియా తరుపున ఆడారు. రెండు వన్డేలాడి ఓ వికెట్ తీశాడు ఆర్పీ సింగ్.

రషీద్ పటేల్: టీమిండియా తరుపున వన్డేల్లో ఆరంగ్రేటం చేసిన మూడో ఎడమ చేతి స్పీడ్ బైలర్ రషీద్ పటేల్. టీమిండియా తరుపున ఓ వన్డే, ఓ టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడిన రషీద్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు...

జహీర్ ఖాన్: టీమిండియా తరుపున లెజెండరీ లెఫ్టార్మ్ పేసర్‌గా గుర్తింపు పొందాడు జహీర్ ఖాన్. 200 వన్డేలు ఆడిన జహీర్ ఖాన్ 282 వికెట్లు పడగొట్టాడు...

ఆశీష్ నెహ్రా: టీమిండియా తరుపున 120 వన్డే మ్యాచులు ఆడిన ఆశీష్ నెహ్రా 157 వికెట్లు పడగొట్టాడు. 2017లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు నెహ్రా.

ఇర్ఫాన్ పఠాన్: కెరీర్ ఆరంభంలో అద్భుత గణాంకాలు నమోదుచేసి అందర్నీ అబ్బురపరిచాడు ఈ లెఫ్టార్మ్ పేసర్ ఆల్‌రౌండర్. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌పైన ఫోకస్ పెట్టడంతో వికెట్లు తీయలేకపోయాడు. 120 వన్డేల్లో 173 వికెట్లు తీసిన ఇర్ఫాన్ పఠాన్, టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన భారత రెండో పేసర్.

ఆర్పీ సింగ్: రుద్ర ప్రతాప్ సింగ్ 58 వన్డేల్లో 69 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ తర్వాత వికెట్లు తీయలేకపోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు ఆర్పీ సింగ్.

జయదేవ్ ఉనద్కడ్: దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి, భారీ అంచనాలతో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు జయదేవ్ ఉనద్కడ్. అయితే 7 వన్డేలు ఆడిన ఉనద్కడ్, 8 వికెట్లు మాత్రమే తీశాడు.

బరిందర్ స్రాన్: జయదేవ్‌లాగే బరిందర్ కూడా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. 6 వన్డేలు ఆడిన బరిందర్ స్రాన్, 7 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఫించ్, వార్నర్, స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేసిన బరిందన్ స్రాన్, ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు.

ఖలీల్ అహ్మద్: ఐపీఎల్ ప్రదర్శన ద్వారా టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేశాడు ఖలీల్ అహ్మద్. అయితే 11 వన్డేలు ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ పేసర్ 15 వికెట్లు పడగొట్టాడు... అయితే భారీగా పరుగులు ఇవ్వడంతో ఖలీల్ జట్టులో స్థానం కోల్పోయాడు.

టి నటరాజన్: ఖలీల్ అహ్మద్ తర్వాత రెండేళ్లకి క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు టి నటరాజన్. ఐపీఎల్‌లో యార్కర్లతో అదరగొట్టిన నటరాజన్, తమిళనాడు ప్రీమియర్ లీగ్ నుంచి ఐపీఎల్‌కి.. అటు నుంచి టీమిండియాకి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చాడు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?