MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: పొలార్డ్-ధోనిల‌ను వెన‌క్కి నెట్టేశాడు.. ఐపీఎల్ లో సన్‌రైజర్స్ ఆల్ రౌండర్ కొత్త‌ చరిత్ర

IPL 2025: పొలార్డ్-ధోనిల‌ను వెన‌క్కి నెట్టేశాడు.. ఐపీఎల్ లో సన్‌రైజర్స్ ఆల్ రౌండర్ కొత్త‌ చరిత్ర

IPL 2025: ఐపీఎల్ 2025లో పాట్ కమ్మిన్స్ నాయ‌క‌త్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి ఓట‌మిని ఎదుర్కొంది. నికోల‌స్ పురాన్ సునామీ ఇన్నింగ్స్ తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేతిలో ఎస్ఆర్హెచ్ ఓటమిపాలైంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 28 2025, 05:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Sunrisers Hyderabad, SRH, IPL , IPL 2025

Sunrisers Hyderabad, SRH, IPL , IPL 2025

IPL 2025: Pat Cummins: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఏడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయాన్ని అందుకుంది. పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, ఈ కంగారూ ఆల్ రౌండర్ గొప్ప రికార్డును సృష్టించాడు. ఎంఎస్ ధోని, కీరన్ పొలార్డ్ వంటి దిగ్గజాలను వెనక్కినెట్టాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Sunrisers Hyderabad all-rounder Pat Cummins creates new history in IPL, surpassing Kieron Pollard and MS Dhoni

Sunrisers Hyderabad all-rounder Pat Cummins creates new history in IPL, surpassing Kieron Pollard and MS Dhoni

హ్యాట్రిక్ సిక్స్‌లు బాదిన ప్యాట్ క‌మ్మిన్స్ 

ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన రెండో అర్ధ సెంచరీ సాధించిన రికార్డు పాట్ కమిన్స్ పేరిట ఉంది. పాట్ కమ్మిన్స్ 2022లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 14 బంతుల్లో 50 పరుగులు ధ‌నాధన్ ఇన్నింగ్స్ ను ఆడాడు.  ఇప్పుడు ఐపీఎల్ 2025 లో కూడా మ‌రోసారి అద్భుత‌మైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి రికార్డు సృష్టించాడు.

హైదరాబాద్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై కేవలం 4 బంతుల్లోనే 18 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో తన రెండవ మ్యాచ్ ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ 6వ వికెట్ పడిపోయిన తర్వాత కేవలం 4 బంతులు మాత్రమే ఆడాడు. మొదటి మూడు బంతుల్లో హ్యాట్రిక్ సిక్స‌ర్లు బాదాడు. ఆ త‌ర్వాత నాల్గవ బంతికి ఔటయ్యాడు.

34
Sunrisers Hyderabad all-rounder Pat Cummins creates new history in IPL, surpassing Kieron Pollard and MS Dhoni

Sunrisers Hyderabad all-rounder Pat Cummins creates new history in IPL, surpassing Kieron Pollard and MS Dhoni

ఐపీఎల్ కెప్టెన్ గా పాట్ క‌మ్మిన్స్ గొప్ప రికార్డు
 
ఐపీఎల్ కెప్టెన్‌గా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసిన రికార్డు కమిన్స్ నెలకొల్పాడు. ఈ విషయంలో క‌మ్మిన్స్ దిగ్గజ ప్లేయ‌ర్లు ఎంఎస్ ధోని, కీరన్ పొలార్డ్, రవిచంద్రన్ అశ్విన్‌లను అధిగ‌మించాడు. అలాగే, ఐపీఎల్‌లో తన మొదటి మూడు బంతుల్లో సిక్స్‌లు కొట్టిన నాల్గవ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో మొదటి మూడు బంతుల్లో సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్లు

సునీల్ నరైన్ (KKR) vs RCB, షార్జా, 2021
నికోలస్ పూరన్ (LSG) vs SRH, హైదరాబాద్, 2023
MS ధోని (CSK) vs MI, ముంబై, 2024
పాట్ కమ్మిన్స్ (SRH) vs LSG, హైదరాబాద్, 2025

44
Sunrisers Hyderabad all-rounder Pat Cummins creates new history in IPL, surpassing Kieron Pollard and MS Dhoni

Sunrisers Hyderabad all-rounder Pat Cummins creates new history in IPL, surpassing Kieron Pollard and MS Dhoni

కెప్టెన్‌గా ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ప్లేయ‌ర్లు

450 - పాట్ కమ్మిన్స్ (SRH) vs LSG, హైదరాబాద్, 2025
425 - రవిచంద్రన్ అశ్విన్ (PBKS) vs RR, మొహాలీ, 2019
400 - MS ధోని (CSK) vs LSG, చెన్నై, 2023
400 - కీరన్ పొలార్డ్ (MI) vs RCB, అబుదాబి, 2020

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved