- Home
- Sports
- Cricket
- ఇండియాలో టెస్టు గెలిచేందుకు ఇంత కష్టపడుతున్నారా... రోహిత్ కెప్టెన్సీపై సునీల్ గవాస్కర్ ఫైర్...
ఇండియాలో టెస్టు గెలిచేందుకు ఇంత కష్టపడుతున్నారా... రోహిత్ కెప్టెన్సీపై సునీల్ గవాస్కర్ ఫైర్...
స్వదేశంలో టీమిండియా చాలా పటిష్టమైన జట్టు. గత 10 ఏళ్లలో భారత జట్టు, స్వదేశంలో ఓడిపోయిన టెస్టులు కేవలం మూడంటే మూడు. అలాంటి టీమిండియా, ఇండోర్ టెస్టులో చిత్తుగా ఓడింది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ ఆస్ట్రేలియా ఆధిక్యం కొనసాగుతోంది...

Image credit: PTI
మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది టీమిండియా. ఈ ఎఫెక్ట్‌తో నాలుగో టెస్టు కోసం మంచి బ్యాటింగ్ పిచ్ సిద్ధం చేయించింది. అయితే టాస్ ఓడడం, ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది...
Image credit: PTI
‘స్వదేశంలో టీమిండియా, ఆతిథ్య జట్టుపై ఆధిక్యం సాధించడానికి ఇంత కష్టపడుతుందంటే అది కచ్ఛితంగా కెప్టెన్సీ వైఫల్యమే. మొదటి రోజు చివరి గంటలో టీమిండియా, వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోలేకపోయింది. కొత్త బంతి తీసుకున్న తర్వాత భారత బౌలర్లు చాలా పరుగులు సమర్పించేశారు...
Virat Kohli-Rohit Sharma
కొత్త బంతి తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా బ్యాటర్లు చాలా ఫ్రీగా బౌండరీలు బాదారు. కొత్త బంతి తీసుకున్న తర్వాత స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం మూర్ఖత్వం. కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లను బౌలింగ్ చేయించి, కాస్త పాతబడ్డాక స్పిన్నర్లకు ఇవ్వాలి...
Image credit: Getty
ఈ విషయం కూడా రోహిత్ శర్మకు తెలియలేదా? స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు బౌండరీలు కొడుతుంటే చూస్తూ ఊరుకున్నాడు. ఈ నిర్లక్ష్యమే, అలసత్వమే... మూడో టెస్టు ఓడిపోవడానికి కారణమైంది. ప్రతీ దానికి ప్లాన్ బీ సిద్ధంగా ఉండాలి...
Image credit: PTI
టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేయాల్సి వస్తే, వికెట్లు ఎలా పడగొట్టాలో ఓ ప్రణాళిక రూపొందించుకోవాలి. అయితే టీమిండియా బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే... టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని మెంటల్‌గా ఫిక్స్ అయినట్టు, ఫీల్డింగ్ చేయడానికి సిద్ధంగా లేనట్టు కనిపించింది...’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
‘మేం 80, 90ల్లో ఉన్నప్పుడు కొత్త బంతి గురించి చాలా చర్చ జరిగేది. పాత బంతితో ప్రత్యర్థి పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతుంటే దాన్ని కొనసాగించేవాళ్లు. కొత్త బంతి తీసుకోవడానికి ఇష్టపడేవాళ్లు కాదు. పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం రానప్పుడు, పాత బంతిని కొనసాగించడమే కరెక్ట్ పని...
Image credit: PTI
ఎందుకంటే కొత్త బాల్ తీసుకుంటే వెంటవెంటనే వికెట్లు పడిపోవు. ఒకవేళ పాత బంతి మరీ పాడైపోయి, బౌలింగ్ చేయడానికి కూడా సరిగ్గా లేకపోతే రెండో కొత్త బంతిని తీసుకుంటారు. అయితే టీమిండియా మాత్రం అటాకింగ్ ఆప్షన్ ఎంచుకుని కొత్త బాల్ తీసుకుంది..