- Home
- Sports
- Cricket
- మయాంక్ ఆ రోజు నాతో అలా అన్నాడు... ఈ రోజు అతని స్థానంలో నేను ఫైనల్ ఆడుతున్నా... - శుబ్‌మన్ గిల్...
మయాంక్ ఆ రోజు నాతో అలా అన్నాడు... ఈ రోజు అతని స్థానంలో నేను ఫైనల్ ఆడుతున్నా... - శుబ్‌మన్ గిల్...
మయాంక్ అగర్వాల్... టీమిండియాలో మోస్ట్ అండర్‌రేటెడ్ బ్యాట్స్‌మెన్. 2018లో ఆస్ట్రేలియాలో ఆరంగ్రేటం చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత వెస్టిండీస్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సిరీసుల్లో కూడా అద్భుతంగా రాణించాడు. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మాత్రం అతనికి చోటు దక్కలేదు.

2020 న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు ఘోరంగా ఫెయిల్ అయింది. అయితే ఆ పర్యటనలో భారత జట్టు నుంచి హాఫ్ సెంచరీ చేసిన వారిలో మయాంక్ అగర్వాల్, హనుమ విహారి కూడా ఉన్నారు.

విహారితో పాటు మయాంక్ అగర్వాల్‌కి ఫైనల్ ఆడే తుదిజట్టులో చోటు దక్కలేదు. న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌పై హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న పృథ్వీషాను అసలు టూర్‌కే ఎంపిక చేయలేదు టీమిండియా. గత పర్యటనలో హాఫ్ సెంచరీ చేసి, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఆడబోతున్న ఒకే ఒక్క ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో 12 మ్యాచులు ఆడిన మయాంక్ అగర్వాల్, రెండు డబుల్ సెంచరీలు, మూడు సెంచరీలతో 867 పరుగులుచేశాడు. సగటు 42.85...

టీమిండియా తరుపున అజింకా రహానే (1095 పరుగులు), రోహిత్ శర్మ (1030 పరుగులు), విరాట్ కోహ్లీ (877 పరుగులు) మాత్రమే మయాంక్ అగర్వాల్ కంటే ఎక్కువ పరుగులు చేశారు. పూజారా అయితే 29.21 సగటుతో 818 పరుగులే చేశాడు.

అయితే ఆస్ట్రేలియా పర్యటనలో మయాంక్ అగర్వాల్ పెద్దగా రాణించలేకపోయాడు. మయాంక్ అగర్వాల్ స్థానంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన శుబ్‌మన్ గిల్ ఆకట్టుకోవడంతో అతనికి రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం దక్కింది.

టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తిచేసుకున్న మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన మయాంక్ అగర్వాల్, మెల్‌బోర్న్ టెస్టులో ఆరంగ్రేటం చేసిన మయాంక్ అగర్వాల్‌కి ఎంతో సాయం చేశాడట...

ఆడిలైడ్ ఘోర పరాజయం తర్వాత మెల్‌బోర్న్ టెస్టులో పృథ్వీషా స్థానంలో శుబ్‌మన్ గిల్‌కి అవకాశం కల్పించింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు...

‘ఆరంగ్రేటం టెస్టులో మయాంక్ అగర్వాల్, నాకు ఎంతగానో సాయం చేశాడు. క్రీజులోకి వెళ్లే సమయంలో ‘‘నువ్వు తొలి టెస్టు ఆడుతున్నావు, నేను ఫస్ట్ బాల్ తీసుకుంటాను’’ అని చెప్పాడు. అయితే అనుకోకుండా ఫస్ట్ ఓవర్ ఆఖరి బంతికే అవుట్ అయ్యాడు. ఇప్పుడు మయాంక్ అగర్వాల్ స్థానంలో నేను ఫైనల్ ఆడబోతున్నా... ఫైనల్‌లో మయాంక్ లేకపోవడం కొంచెం బాధగా ఉంది...’ అని చెప్పాడు శుబ్‌మన్ గిల్.

మెల్‌బోర్న్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన మయాంక్ అగర్వాల్, రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఎంట్రీ ఇవ్వడంతో మయాంక్ అగర్వాల్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు.

గబ్బా టెస్టులో హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా గాయాల కారణంగా బరిలో దిగకపోవడంతో మయాంక్ అగర్వాల్‌కి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కి అవకాశం దక్కింది. అయితే ఆ టెస్టులో కూడా మయాంక్ అగర్వాల్ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయాడు.

‘మయాంక్ అగర్వాల్ లాంటి బ్యాట్స్‌మెన్, భారత జట్టు రిజర్వు బెంచ్‌లో ఉండడం టీమిండియా బలాన్ని తెలియచేస్తోంది... అతను ఫ్యూచర్ వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్...’ అంటూ కామెంట్ చేశాడు వీవీఎస్ లక్ష్మణ్.

ఇప్పటిదాకా సాగిన మయాంక్ అగర్వాల్ టెస్టు కెరీర్‌లో ప్రతీ ఐదు ఇన్నింగ్స్‌లకి ఓసారి భారీ స్కోరు చేస్తూ వచ్చాడు. 14 టెస్టుల్లో 1052 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ టెస్టు కెరీర్‌లో అత్యధిక స్కోరు 243 పరుగులు.