- Home
- Sports
- Cricket
- ఎందుకు సెలక్ట్ చేయలేదంటే, ‘స్టుపిడ్’ ఆన్సర్లు చెప్పారు... సెలక్టర్లపై షెల్డన్ జాక్సన్ ఫైర్...
ఎందుకు సెలక్ట్ చేయలేదంటే, ‘స్టుపిడ్’ ఆన్సర్లు చెప్పారు... సెలక్టర్లపై షెల్డన్ జాక్సన్ ఫైర్...
దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న సౌరాష్ట్ర వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్... ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇంతకుముందు ఎమ్మెస్ ధోనీ కారణంగా టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన షెల్డన్ జాక్సన్, ఇప్పుడు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ వంటి యంగ్ వికెట్ కీపర్ల కారణంగా జట్టులోకి రాలేకపోతున్నాడు...

sheldon jackson
రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో 800లకు పైగా పరుగులు చేసిన షెల్డన్ జాక్సన్, 76 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 49.22 సగటుతో 5634 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో టాప్ ప్లేయర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నా, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు...
35 ఏళ్ల షెల్డన్ జాక్సన్, టీమిండియాలో చోటు దక్కకపోవడంతో స్పోర్ట్స్ క్రీడా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సెలక్టర్లు నన్ను ఇంతవరకూ ఎప్పుడూ సంప్రదించింది లేదు. అయితే ఓ సారి బీసీసీఐ పెద్దలలో ఒకరితో ఈ విషయం గురించి మాట్లాడాను...
నన్ను ఎందుకు సెలక్ట్ చేయడం లేదు, టీమిండియాలోకి రావాలంటే ఇంకా నేనేం చేయాలి... అని అడిగాను. దానికి అతను, ‘మేం 30 ఏళ్లు దాటిన వాళ్లను టీమ్‌కి సెలక్ట్ చేయడం లేదు. టీమ్‌కి సెలక్ట్ అయ్యేవాళ్లు కొన్నేళ్ల పాటు సేవలు అందించగలగాలని అనుకుంటున్నాం...’ అంటూ స్టుపిడ్ సమాధానం చెప్పాడు...
ఆ సమాధానం విన్న ఏడాదికి 32-33 ఏళ్లున్న ఓ క్రికెటర్‌ని టీమ్‌కి సెలక్ట్ చేశారు. 30 ఏళ్లు దాటిన వాళ్లను టీమిండియాకి సెలక్ట్ చేయకూడదని రాజ్యాంగంలో రాసి ఉంది... 30 ఏళ్లు దాటిన వాళ్లు, ఆడడానికి పనికి రారా?
అలా అయితే ఓ చట్టం తీసుకురండి. 30 ఏళ్లు దాటిన వాళ్లు ఆడకూడదని లా పాస్ చేయండి... ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సౌరాష్ట్ర వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్...
sheldon jackson
2006లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన షెల్డన్ జాక్సన్, ఐపీఎల్‌లో చెప్పుకోదగ్గ అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. 2009లో కేకేఆర్, ఆ తర్వాత ఆర్‌సీబీ... షెల్డన్ జాక్సన్‌ను కొనుగోలు చేసినా పెద్దగా ఛాన్సులు ఇవ్వలేదు...
Sheldon Jackson
‘అవును.. నా వయసు 35 ఏళ్లు. అయితే నేను 22, 23 ఏళ్ల కుర్రాళ్ల కంటే బాగా పర్ఫామ్ చేస్తున్నా. మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నా సరే, వయసు పెరిగితే జాతీయ జట్టుకి సెలక్ట్ చేయకూడదని ఎక్కడ రాసి ఉంది?.. రెండు, మూడు సీజన్లుగా 800-900 పరుగులు చేయడమంటే అంత తేలికయ్యే పనేనా... ఫిట్‌నెస్ లేని ప్లేయర్ ఇలా పరుగులు సాధించగలడా? నాలో నిలకడ లేదా?’ అంటూ ఆవేదన వ్యక్లం చేశాడు జాక్సన్...