MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • RR vs KKR: రాజ‌స్థాన్ ను దంచికొట్టిన క్వింట‌న్ డీకాక్

RR vs KKR: రాజ‌స్థాన్ ను దంచికొట్టిన క్వింట‌న్ డీకాక్

Rajasthan Royals vs Kolkata Knight Riders: క్వింట‌న్ డీకాక్ అద్భుత‌మైన హఫ్ సంచ‌రీతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ విక్ట‌రీ అందుకుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 27 2025, 12:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Image Credit: Twitter/KKR

Image Credit: Twitter/KKR

Quinton de Kock: ఐపీఎల్ ఆరో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు గౌహతిలో తలపడ్డాయి. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన కేకేఆర్ ఈ మ్యాచ్ లో విజ‌యంతో ఐపీఎల్ 2025లో విన్నింగ్ ట్రాక్ లోకి వ‌చ్చింది. రియాన్ పరాగ్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఇంకా గెలుపు ఖాతాను తెర‌వ‌లేక‌పోయింది. ఈ మ్యాచ్ లో రాజ‌స్థాన్ జట్టును కోల్ క‌తా టీమ్  8 వికెట్ల తేడాతో ఓడించింది. కేకేఆర్ విజ‌యంలో క్వింటన్ డి కాక్ హీరోగా నిలిచాడు.

టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ టీమ్ బౌలర్లు అంచనాలకు తగ్గట్టుగానే వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, మోయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు పడగొట్టారు. స్పెన్సర్ జాన్సన్ ఒక వికెట్ ద‌క్కింది.దీంతో 20 ఓవ‌ర్ల‌లో ఆర్ఆర్ 152 పరుగుల టార్గెట్ ను ఉంచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
Quinton de Kock

Quinton de Kock

 

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో బలహీనంగా కనిపించింది. విధ్వంసకర బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ 29 పరుగులు చేయగా, కెప్టెన్ రియాన్ పరాగ్ 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ధ్రువ్ జురెల్ 33 పరుగులు చేశాడు. స్వ‌ల్ప టార్గెట్ తో బ్యాటింగ్ మొద‌లుపెట్టిన కేకేఆర్ కు ఆ టీమ్ బ్యాట‌ర్లు మంచి ఆరంభం అందించారు. మ‌రీ ముఖ్యంగా 97 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ తో కేకేఆర్ కు క్వింట‌న్ డీకాక్ విజ‌యాన్ని అందించాడు. 


క్వింట‌న్ డీకాక్ సూప‌ర్ నాక్ !  

ఈ మ్యాచ్ లో క్వింట‌న్ డీకాక్ అద్భుత‌మైన ఆట‌తో ఆల‌రించాడు. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచి సూపర్ షాట్స్ తో రాజస్థాన్ బౌలింగ్ ను చిత్తుచేశాడు. 61 బంతుల్లో 97* ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్లు బాదాడు. ర‌ఘువంశీ 22 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. దీంతో 17.3 ఓవ‌ర్ల‌లో కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి 153 ప‌రుగుల‌తో విజ‌యాన్ని అందుకుంది. జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు పరుగుల వేటలో కేకేఆర్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. 

కేకేర్ ఛేజింగ్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్-ప్లేయ‌ర్లు 

97* - క్వింటన్ డి కాక్ vs RR, గౌహతి, 2025
94 - మనీష్ పాండే vs PBKS, బెంగళూరు, 2014 ఫైనల్
93* - క్రిస్ లిన్ vs GL, రాజ్‌కోట్, 2017
92 - మన్వీందర్ బిస్లా vs CSK, చెన్నై, 2013
90* - గౌతమ్ గంభీర్ vs SRH, హైదరాబాద్, 2016

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు
Recommended image2
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved