రోహిత్ శర్మ టీమిండియాకి కెప్టెన్ కాకపోతే, అది మనకే నష్టం... గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు...

First Published 12, Nov 2020, 1:02 PM

IPL 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపి, ఏకంగా ఐదు టైటిల్స్ సాధించిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచిన రోహిత్ శర్మ, టీమిండియాకి కెప్టెన్ కాకపోతే అతనికేమీ నష్టం జరగదని, భారత జట్టు చాలా కోల్పోతుందని హాట్ కామెంట్స్ చేశాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.

రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత ముంబై ఇండియన్స్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది... గత 8 సీజన్లలో ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్.

అప్పటిదాకా ఐపీఎల్‌లో తిరుగులేని జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కి కూడా చుక్కలు చూపిస్తోంది ముంబై జట్టు. గత సీజన్‌లో ఫైనల్‌తో సహా నాలుగు మ్యాచుల్లో చెన్నైని చిత్తు చేసిన ముంబై, నాలుగు సార్లు ధోనీ నాయకత్వంలోని జట్లను ఫైనల్‌లో ఓడించి టైటిల్స్ సాధించింది.

2020 సీజన్‌లో పూర్తి డామినేషన్ కనబర్చిన ముంబై ఇండియన్స్... ఢిల్లీ ఇండియన్స్‌ను చిత్తు చేసి ఐదో టైటిల్ గెలుచుకుంది. దీంతో ముంబై సారథి రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్‌గా చేయాలని అంటున్నాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘రోహిత్ శర్మ కచ్ఛితంగా భారత టీ20 కెప్టెన్ కావాలి. అద్భుతమైన వ్యక్తి, మేనేజర్, లీడర్. టీ20 గేమ్స్‌ను ఎలా గెలవాలో బాగా తెలిసిన వ్యక్తి. రోహిత్‌ను టీ20 కెప్టెన్‌గా చేస్తే, విరాట్‌కి కూడా ఆటగాడిగా పూర్తి ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన అన్ని జట్ల విషయంలో ఇది సక్సెస్ అయ్యింది కూడా’ అని ట్వీట్ చేశాడు మైకేల్.

‘రోహిత్ శర్మ భారత కెప్టెన్ కాకపోతే, అతనికి ఎలా నష్టం ఉండదు. కానీ భారత జట్టు చాలా నష్టపోతుంది. అవును, కెప్టెన్ అనేవాడు జట్టులాగే సమర్థవంతుడై ఉండాలి. కానీ ఓ కెప్టెన్ సమర్థుడో, కాదో తెలపడానికి లెక్కలేమైనా ఉన్నాయా? ఉంటే అవి జట్టుకి అతను అందించిన విజయాలే కదా. రోహిత్ శర్మ గెలిచిన టైటిల్స్ సరిపోవా... అతను మంచి కెప్టెన్ అని చెప్పడానికి...’ అని కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్.

‘విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా పనికి రాడని నేను చెప్పడం లేదు... కానీ విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. 8 సీజన్లుగా కెప్టెన్‌గా ఉన్నా, ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు కోహ్లీ. అదే టైమ్‌లో రోహిత్ శర్మ ఐదుసార్లు తన జట్టును ఛాంపియన్ చేశాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు గౌతీ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌‌లో మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన తర్వాత... విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇచ్చిన 8 ఏళ్ల కాలం చాలా ఎక్కువని, అయినా విరాట్ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడని... ఇప్పటికైనా బాధ్యత వహించి కెప్టెన్సీ నుంచి పక్కకి తప్పుకోవాలని అన్నాడు గౌతమ్ గంభీర్.

గౌతమ్ గంభీర్‌కి, విరాట్ కోహ్లీకి మధ్య ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. అప్పటినుంచి ఈ కేకేఆర్ మాజీ కెప్టెన్, విరాట్ కోహ్లీపై ఇలా కామెంట్లు చేస్తూనే ఉన్నాడు.

ఇదిలా ఉంటే ఆసీస్ టూర్‌లో జరిగే టీ20 సిరీస్‌కు, వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మను గాయం కారణంగా పక్కనబెట్టింది బీసీసీఐ. గాయం నుంచి కోలుకుని ముంబై తరుపున మూడు మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో మాత్రమే ఆడబోతున్నాడు.