ధోనీని దాటేసిన రోహిత్ శర్మ... టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన వారి లిస్టులో...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఓడిన తర్వాత వెస్టిండీస్ పర్యటనకి వెళ్లింది భారత జట్టు. మూడేళ్లు సరైన వీక్ ప్రత్యర్థి దొరకక పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడిన భారత స్టార్ ప్లేయర్లు, సీనియర్ బ్యాటర్లు.. వెస్టిండీస్ పర్యటనలో ప్రతాపం చూపిస్తూ రికార్డుల మోత మోగిస్తున్నారు..
Rohit Sharma
విదేశాల్లో దారుణమైన టెస్టు ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్ శర్మ, వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసి... విదేశాల్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. రోహిత్ శర్మ కెరీర్‌లో 10 టెస్టు సెంచరీలు చేస్తే, అందులో రెండు మాత్రమే విదేశాల్లో వచ్చాయి..
Rohit Sharma
తాజాగా రెండో టెస్టులోనూ 50+ స్కోరు బాదిన రోహిత్ శర్మ, విదేశాల్లో తన టెస్టు సగటు (37.05)ని మెరుగ్గా చేసుకున్నాడు. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది..
Rohit Sharma
భారత జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడాడు రోహిత్ శర్మ. సచిన్ టెండూల్కర్ 34357 పరుగులతో ఈ లిస్టులో టాప్‌లో ఉంటే విరాట్ కోహ్లీ 25461+ పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు...
Rohit Sharma
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ 24208 పరుగులతో టాప్ 3లో ఉంటే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 18,575 అంతర్జాతీయ పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 17266 అంతర్జాతీయ పరుగులు చేస్తే, వీరేంద్ర సెహ్వాగ్ 17253 పరుగులు చేశాడు..
Rohit Sharma
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో చేసిన పరుగులతో 17300+ పరుగులు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, ఒకే ఇన్నింగ్స్‌తో వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీలను వెనక్కి నెట్టేశాడు. మరో 1400+ పరుగులు చేస్తే రోహిత్ శర్మ, ఈ లిస్టులో టాప్ 4కి చేరతాడు...
Rohit Sharma
టాప్ 3లో ఉన్న రాహుల్ ద్రావిడ్‌ని చేరుకోవాలంటే మాత్రం రోహిత్ శర్మ మరో 7 వేల పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే 36 ఏళ్ల రోహిత్ శర్మ ఆ రికార్డును అందుకోవడం ఇక అసాధ్యమే..
Rohit Sharma
విదేశాల్లో రోహిత్ శర్మకు ఇది 60వ 50+ స్కోరు. 59 సార్లు విదేశాల్లో 50+ స్కోర్లు బాదిన సౌరవ్ గంగూలీని దాటేసిన రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ (96 సార్లు), విరాట్ కోహ్లీ (88 సార్లు), రాహుల్ ద్రావిడ్ (87 సార్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు..