- Home
- Sports
- Cricket
- రోహిత్ శర్మ హాలీడేస్ సరిపోలేదా... టీమ్ కంటే అది ముఖ్యమైందా? గల్లీలో క్రికెట్ ఆడుతూ...
రోహిత్ శర్మ హాలీడేస్ సరిపోలేదా... టీమ్ కంటే అది ముఖ్యమైందా? గల్లీలో క్రికెట్ ఆడుతూ...
రోహిత్ శర్మ... లేటు వయసులో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న క్రికెటర్. ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే కెప్టెన్సీ తీసుకున్న తర్వాత 8 నెలల కాలంలో మూడు సిరీస్‌లకు దూరమయ్యాడు రోహిత్...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఆడని రోహిత్ శర్మ, ఆ తర్వాత గాయం కారణంగా సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లనలేదు... గాయం నుంచి కోలుకుని తిరిగి స్వదేశంలో విండీస్, శ్రీలంకలతో సిరీస్‌లు ఆడాడు రోహిత్...
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కోరుకున్న హిట్ మ్యాన్, ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కి బయలుదేరిన టీమ్‌లో కనిపించకపోవడం హాట్ టాపిక్ అయ్యింది...
Image credit: PTI
ఇంగ్లాండ్‌తో ఆడాల్సిన ఐదో టెస్టు కోసం జూన్ 16న లండన్‌కి బయలుదేరి వెళ్లింది భారత జట్టు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సభ్యులుగా ఉన్న రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌తో పాటు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్... ఈ నెల 20న ఇంగ్లాండ్‌కి పయనం కానున్నారు...
Image credit: IPL
అయితే సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి దూరంగా ఉన్న రోహిత్ శర్మ కూడా లేటుగా ఇంగ్లాండ్‌కి వెళ్లాలని నిర్ణయించుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆఖరి స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేదు...
ప్లేఆఫ్స్‌కి ముందు హాలీడేస్ కోసం కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో వాలిపోయిన రోహిత్ శర్మ, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ముంబై వీధుల్లో గల్లీ క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ఇంగ్లాండ్ టూర్ వెళ్లే టీమ్ అంతా బీసీసీఐ క్యాంపులో చేరితే, రోహిత్ శర్మ మాత్రం గల్లీ క్రికెట్ ఆడుతూ కనిపించడంతో ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు...
రోహిత్ శర్మకు ఇంకా హాలీడేస్ సరిపోనట్టున్నాయని, టీమిండియాకి ఆడడం కంటే గల్లీ క్రికెట్ ఆడడంలోనే హిట్ మ్యాన్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుందని ట్రోల్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మే 22 నుంచి క్రికెట్‌కి దూరంగా ఉన్న రోహిత్ శర్మ, టీమ్‌తో కలిసి వెళ్లకుండా సెపరేట్‌గా వెళ్లాల్సిన అవసరం ఏముందనేది వారి అనుమానం...