- Home
- Sports
- Cricket
- అనిల్ కుంబ్లేకి షాక్... కొత్త కోచ్ వేటలో పంజాబ్ కింగ్స్! రవిశాస్త్రి, ఇయాన్ మోర్గాన్‌లతో పాటు...
అనిల్ కుంబ్లేకి షాక్... కొత్త కోచ్ వేటలో పంజాబ్ కింగ్స్! రవిశాస్త్రి, ఇయాన్ మోర్గాన్‌లతో పాటు...
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ రూటే సెపరేట్. 14 ఏళ్ల లీగ్ చరిత్రలో ఒకే ఒక్కసారి ఫైనల్ చేరి, రెండు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్ ఆడిన పంజాబ్ కింగ్స్, సీజన్‌కో కెప్టెన్‌ని, లోగోని మారుస్తూ పోతుంటుంది. ఆఖరికి ఫ్రాంఛైజీ పేరు మార్చినా పంజాబ్‌కి (మునుపు పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్) ఏదీ కలిసి రాలేదు... ఈసారి హెడ్ కోచ్‌ని కూడా మార్చేందుకు సిద్ధమవుతోందట ప్రీతి జింటా టీమ్...

Image Credit: PTI
2020-21 సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కి మారాడు. పంజాబ్ టీమ్‌ని రెండు సీజన్లలో ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్ చేర్చలేకపోయిన కెఎల్ రాహుల్, 2022లో లక్నో టీమ్‌ని నాకౌట్ స్టేజీకి చేర్చాడు...
కెఎల్ రాహుల్ హ్యాండ్ ఇవ్వడంతో మయాంక్ అగర్వాల్‌ని కెప్టెన్‌గా నియమించుకుంది పంజాబ్ కింగ్స్. గత సీజన్‌లో బ్యాటర్‌గా మెప్పించిన మయాంక్ అగర్వాల్, ఈసారి కెప్టెన్సీ ప్రెషర్ వల్ల బ్యాటింగ్‌లోనూ సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేక ఫెయిల్ అయ్యాడు...
దీంతో ఈసారి కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు చేయాలని ఫిక్స్ అయ్యింది పంజాబ్ కింగ్స్ యాజమాన్యం. 2019 అక్టోబర్ నుంచి పంజాబ్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నాడు భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే...
అనిల్ కుంబ్లే కోచింగ్‌లో వరుసగా నాలుగు సీజన్లలోనూ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది పంజాబ్ కింగ్స్. నాలుగు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను, ప్లేయర్లను మార్చినా ఫలితం మాత్రం మారలేదు... అందుకే కుంబ్లేని సాగనంపి, కొత్త హెడ్ కోచ్‌ని నియమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఆ ఫ్రాంఛైజీ...
Eoin Morgan
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ హెడ్ కోచ్ ట్రేవర్ బేలిస్‌లను ఇప్పటికే సంప్రదించిన పంజాబ్ కింగ్స్ యాజమాన్యం... ఓ మాజీ హెడ్ కోచ్‌తో కూడా సంప్రదింపులు జరుగుతోందట...
భారత జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించి, సక్సెస్‌ఫుల్ హెడ్ కోచ్‌లలో ఒకడిగా నిలిచిన రవిశాస్త్రిని, వచ్చే సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా రావాల్సిందిగా కోరిందట సదరు ఫ్రాంఛైజీ. అయితే టీమిండియా హెడ్ కోచ్ కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు రవిశాస్త్రి...
Image credit: PTI
క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన ఇయాన్ మోర్గాన్ కూడా కామెంటేటర్‌గా న్యూ ఇన్నింగ్స్ మొదలెట్టాడు. ఇంగ్లాండ్‌కి హెడ్ కోచ్‌గా 2019 వన్డే వరల్డ్ కప్ అందించిన ట్రేవర్ బేలిస్, ప్రస్తుతం ఆస్ట్రేలియా కోచ్‌గా ఉన్నాడు. మరి వీరిలో ఎవరు పంజాబ్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా వచ్చి, ఆ ఫ్రాంఛైజీ రాత మారుస్తాడో చూడాలి...