టీమిండియా, పాక్‌కి రాకపోతే మేం వన్డే వరల్డ్ కప్ ఆడం... పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా కామెంట్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కి ముందు నుంచే ఆసియా కప్ 2023 టోర్నీ గురించి చర్చ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ 2022 టోర్నీ జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో జరిగే ఆసియా కప్ కోసం టీమిండియా, పాకిస్తాన్‌కి వెళ్తుందా? అనేది ఆసక్తికర ప్రశ్నగా మారింది...
India vs Pakistan
పాకిస్తాన్‌కి వెళ్లాలా? లేదా? అనేది తమ చేతుల్లో లేదని, కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తామని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ భిన్నీ కామెంట్ చేశాడు. అయితే సెక్రటరీ జై షా మాత్రం పాకిస్తాన్‌లో అడుగు పెట్టేది లేదని, తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీ జరుగుతుందని చెప్పి షాక్ ఇచ్చాడు...
జై షా, బీసీసీఐ సెక్రటరీ మాత్రమే కాదు ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మెన్ కూడా. అదీకాకుండా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కొడుకు.స్వయంగా కేంద్ర మంత్రి కొడుకు ప్రకటించడంతో భారత జట్టును, పాక్ పంపించడం కేంద్రానికి ఇష్టం లేదని తేలిపోయింది...
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు, ఆసియా కప్ 2023 టోర్నీ కోసం పాక్‌కి రావాల్సిందేనని పట్టుబడుతోంది. ‘ఆసియా కప్ 2023 టోర్నీ కోసం భారత జట్టు, పాకిస్తాన్‌కి రాకపోతే మేం ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనం. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం...
భారత జట్టు, ఇక్కడికి వస్తే, మేం అక్కడికి వెళ్తాం. వాళ్లు రాకపోతే మేం లేకుండానే వరల్డ్ కప్ జరుపుకోవచ్చు... పాక్ క్రికెట్ బోర్డు ఎవ్వరికీ భయపడదు. పాకిస్తాన్ క్రికెట్ ఎకానమీని బాగుచేయాల్సిన బాధ్యత పీసీబీపైన ఉంది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాని ఓడించడం...
ఆసియా కప్ 2022 టోర్నీలో కూడా భారత జట్టును చిత్తు చేశాం. ఒకే ఏడాది గ్యాప్‌లో పాకిస్తాన్ క్రికెట్ టీమ్, బిలియన్ డాలర్ ఎకానమీ టీమ్‌ని రెండు సార్లు ఓడించింది. పాక్ పటిష్టంగా మారిందని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా...
భారత జట్టు, పాకిస్తాన్‌కి వెళ్లకపోతే ఆసియా కప్ 2023 టోర్నీకి క్రేజ్ పూర్తిగా పోతుంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, కొన్ని వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే పాకిస్తాన్, వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాకి రాకపోతే కూడా పీసీబీకే నష్టం జరుగుతుంది. ఐసీసీ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా వచ్చే కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ద్వారా వచ్చే భారీ ఆదాయం, బీసీసీఐ కోల్పోవాల్సి ఉంటుంది..