- Home
- Sports
- Cricket
- Rishabh Pant: ఇది టీ20 ఆట కాదు.. అతడొస్తే పంత్ పక్కకే : టీమిండియా కెప్టెన్ పై జాఫర్ షాకింగ్ కామెంట్స్
Rishabh Pant: ఇది టీ20 ఆట కాదు.. అతడొస్తే పంత్ పక్కకే : టీమిండియా కెప్టెన్ పై జాఫర్ షాకింగ్ కామెంట్స్
IND vs SA T20I: సీనియర్ల గైర్హాజరీలో టీమిండియాను నడిపిస్తున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఆడుతున్నది టీ20లు అని గుర్తుపెట్టుకోవాలని భారత జట్టు మాజీ బ్యాటర్ వసీం జాఫర్ తెలిపాడు.

టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ ఇప్పటికైనా తాను ఆడుతున్నది ధనాధన్ క్రికెట్ అని తెలుసుకోవాలని.. ఐపీఎల్ లో కూడా విఫలమైన అతడు ఇకనైనా మేలుకోకంటే భవిష్యత్ లో కష్టమేనని మాజీ ఆటగాడు వసీం జాఫర్ అన్నాడు.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15 లో విఫలమైన పంత్.. స్వదేశంలో భారత్ తో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో కూడా తన మార్కును చూపించలేకపోతున్నాడు.
ఈ నేపథ్యంలో జాఫర్ మాట్లాడుతూ.. పంత్ ఇలాగే ఆడితే టీ20 జట్టులో చోటు కోల్పోవడం ఖాయమని అన్నాడు. కెఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్ తో పాటు ఇషాన్ కిషన్ రూపంలో కూడా జట్టుకు అవసరమైన వికెట్ కీపర్ బ్యాటర్లున్నారని.. పంత్ దానిని మైండ్ లో పెట్టుకుని ఆడాలని సూచించాడు.
‘కెఎల్ రాహుల్ కూడా వికెట్ కీపింగ్ చేయగలడు. అతడు తిరిగి జట్టులోకి వస్తే పంత్ కు కష్టమే. రాహుల్ తో పాటు దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్ రూపంలో కూడా పంత్ కు ముప్పు పొంచి ఉంది.
Rishabh Pant
గత కొంతకాలంగా రిషభ్ పంత్ ఆట చూస్తుంటే అతడు ఇక టీ20లకు పనికొస్తాడని నాకైతే అనిపించడం లేదు. ఇప్పటికైనా పంత్ నిలకడగా రాణించాలి. ఐపీఎల్ లో కూడా అతడు ఇలాగే వరుసగా విఫలమయ్యాడు.
పంత్.. టెస్టు, వన్డే క్రికెట్ ను ఎలా ఆడతాడో చూడండి. టీ20లలో కూడా అతడు ఆ అప్రోచ్ తో ఆడాలి. కానీ దురదృష్టవశాత్తూ అతడు అలా ఆడటం లేదు. నన్నడిగితే మాత్రం రిషభ్ రాబోయే రోజుల్లో టీ20 లలో ముందుకు వెళ్లడం అనుమానంగానే ఉంది..’ అని తెలిపాడు.
సౌతాఫ్రికాతో గడిచిన మూడు మ్యాచులలో పంత్.. 29, 5, 6 (మొత్తంగా 40) పరుగులు చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఐపీఎల్-15లో 14 మ్యాచులలో 340 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.