- Home
- Sports
- Cricket
- ఉమ్రాన్ మాలిక్ గురించి భయం లేదు.. స్పీడ్ కంటే అదే ముఖ్యం: సఫారీ పేసర్ షాకింగ్ కామెంట్స్
ఉమ్రాన్ మాలిక్ గురించి భయం లేదు.. స్పీడ్ కంటే అదే ముఖ్యం: సఫారీ పేసర్ షాకింగ్ కామెంట్స్
IND vs SA T20I: ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో ఉమ్రాన్ మాలిక్ ఎంపికైనా తుది జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు. అయితే ఉమ్రాన్ పై సఫారీ పేసర్ అన్రిచ్ నోర్త్జ్..

టీమిండియా యువ సంచలనం, గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంతో బంతులు విసరుతూ తన వేగంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపెడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ పై దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్త్ సంచలన కామెంట్స్ చేశాడు.
ఇరు జట్ల మధ్య రాజ్కోట్ లో నాలుగో టీ20 మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో అతడు.. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ గురించి మాట్లాడాడు. ఉమ్రాన్, నోర్త్జ్ లలో ఎవరు ఎక్కువ ఫాస్ట్ బౌలింగ్ చేస్తారని.. ఇద్దరి బౌలింగ్ గురించి ఇటీవలి కాలంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో అతడు స్పందించాడు.
నోర్త్జ్ మాట్లాడుతూ.. ‘ఉమ్రాన్ మంచి బౌలర్. అతడి బౌలింగ్ లో వేగం ఉంది. తనకు అవకాశాలిస్తే ఏం చేయగలనో అతడు ఐపీఎల్ లో నిరూపించుకున్నాడు. మా ఇద్దరిలో ఎవరు ఫాస్టెస్ట్ బౌలర్ అంటే ఏం చెప్పాలి..?
ఇప్పుడు మేం ఎవరు ఫాస్టెస్ట్ బౌలర్ అనే స్టేజ్ లో లేము. జట్టు గెలుపు కోసం ఏం చేయాలన్నదే ముఖ్యం. ఫాస్ట్ బౌలింగ్ అన్నది అంత పెద్ద విషయం కాదు. వేగం కంటే జట్టును గెలిపించేలా బౌలింగ్ చేయడం ప్రధానమైంది. అసలు నేను దాని గురించి పట్టించుకోవడం లేదు.
కానీ ట్రైనింగ్ సమయంలో మాత్రం ఇంకా వేగం ఎలా పెంచాలి..? అని ఆలోచిస్తాం. దాన్ని బట్టి ట్రైనింగ్‌లో మార్పులు చేసుకుంటాం.. అంతేగానీ మ్యాచులలో మాత్రం వేగం గురంచి పట్టించుకోం..’ అని కామెంట్స్ చేశాడు.
2022 ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ తరఫున ఆడిన ఉమ్రాన్.. 22 వికెట్లు పడగొట్టాడు. తద్వారా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే మూడు మ్యాచులు గడిచినా అతడికి ఇంకా తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. అయితే రాజ్కోట్ మ్యాచ్ లో అవేశ్ ఖాన్ స్థానంలో ఉమ్రాన్ కు గానీ అర్షదీప్ కు గానీ తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.