- Home
- Sports
- Cricket
- ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రోహిత్! వన్‌డౌన్‌లో సూర్య... కెఎల్ రాహుల్‌కి షాక్ ఇచ్చిన గౌతమ్ గంభీర్...
ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రోహిత్! వన్‌డౌన్‌లో సూర్య... కెఎల్ రాహుల్‌కి షాక్ ఇచ్చిన గౌతమ్ గంభీర్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ టీమ్, ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీ ఆరంభించి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతుల్లో ఓడి నాలుగో స్థానానికే పరిమితమైంది. ఈ టీమ్‌కి మెంటర్‌గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కి కెఎల్ రాహుల్‌పై కోపం ఇంకా తగ్గనట్టే కనిపిస్తోంది.

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు కెఎల్ రాహుల్. అయితే సిరీస్ ఆరంభానికి ముందు కెఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఆ పొజిషన్ రిషబ్ పంత్‌కి దక్కింది...
Image credit: PTI
కెఎల్ రాహుల్ స్థానంలో ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్, మొదటి టీ20లో 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు..
Image credit: PTI
కటక్‌లో జరిగిన రెండో టీ20లో రుతురాజ్ గైక్వాడ్ 1 పరుగుకే అవుటై నిరాశపరిచినా 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ పర్వాలేదనిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో 150+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు...
దీంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్...
Gautam Gambhir
‘టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయాలి. ఇషాన్ కిషన్ ఫియర్ లెస్ బ్యాటింగ్, టీమిండియాకి పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు చేయడానికి సహయపడుతుంది. వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి వస్తే బెటర్...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...
KL Rahul-Gautam Gambhir
ఐపీఎల్ 2022 సీజన్‌లో 616 పరుగులు చేసి, వరుసగా మూడు సీజన్లలో 600లకు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్. అయితే రాహుల్ కంటే ఇషాన్ కిషన్ బెటర్ అంటూ గౌతీ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి...
అలాగే టీ20ల్లో టాప్ 3లో విరాట్ కోహ్లీకి చోటు ఇవ్వకూడదని గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్లపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గంభీర్ చెప్పిన బ్యాటింగ్ ఆర్డర్‌ను ఫాలో అయితే ఐదో స్థానంలో కెఎల్ రాహుల్ బ్యాటింగ్‌కి రావాల్సి ఉంటుంది...
అలా జరిగితే ఆరో స్థానంలో రిషబ్ పంత్, ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, చాహాల్‌లతో టీమ్ నిండిపోతుంది. మరో స్పిన్నర్‌ని లేదా పేసర్‌ని ఆడించాలన్నా జడేజా, పాండ్యా వంటి ఆల్‌రౌండర్లలో ఒకరిని పక్కబెట్టాల్సి ఉంటుంది...