- Home
- Sports
- Cricket
- ఆసియా కప్ ఎవరు గెలుస్తారో చెప్పలేం! టీమిండియానే గెలుస్తుందని చెప్పడం కష్టం.. - సౌరవ్ గంగూలీ...
ఆసియా కప్ ఎవరు గెలుస్తారో చెప్పలేం! టీమిండియానే గెలుస్తుందని చెప్పడం కష్టం.. - సౌరవ్ గంగూలీ...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు శ్రీలంకలో ఆసియా కప్ 2023 టోర్నీ ఆడబోతోంది భారత జట్టు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2018 ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత జట్టు, టీ20 ఫార్మాట్‌లో జరిగిన 2022 ఆసియా కప్‌లో మాత్రం ఫైనల్ కూడా చేరలేకపోయింది..

2022 ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజీలో పాకిస్తాన్‌పై ఘన విజయం అందుకున్న భారత జట్టు, సూపర్ 4 రౌండ్‌లో పాక్, శ్రీలంక చేతుల్లో వరుస మ్యాచులు ఓడింది. బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్‌లపై విజయాలు అందుకున్నా, ఫైనల్‌కి మాత్రం అర్హత సాధించలేకపోయింది..
ఎలాంటి అంచనాలు లేకుండా ఆసియా కప్ 2022 టోర్నీలో అడుగుపెట్టిన శ్రీలంక, ఫైనల్‌లో పాకిస్తాన్‌ని ఓడించి టైటిల్ సాధించింది. ఈసారి వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీ కావడంతో ఇండియా, పాకిస్తాన్ హాట్ ఫెవరెట్లుగా బరిలో దిగుతున్నాయి...
‘ఆసియా కప్ 2023 టోర్నీ ఫెవరెట్ ఎవరని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఎవ్వరైనా గెలవచ్చు. రెండు జట్లు కూడా బలంగా ఉన్నాయి. పాకిస్తాన్‌కి మంచి బౌలింగ్ లైనప్ ఉంది. బ్యాటింగ్‌లోనూ వాళ్ల దగ్గర మంచి ప్లేయర్లు ఉన్నారు...
టీమిండియా చాలా మంచి టీమ్. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే బెస్ట్ టీమ్స్ తలబడినప్పుడు ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్లు మాత్రమే గెలుస్తారు. టీమిండియానే గెలిచి తీరుతుందని చెప్పడం కష్టం...
బుమ్రా, ఐర్లాండ్ టూర్‌లో బాగా ఆడాడు. అతను టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చినా, వన్డేల్లో 10 ఓవర్లు ఎలా బౌలింగ్ చేస్తాడనేది చూడాలి. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించి, మునుపటిలా పర్ఫామెన్స్ ఇస్తే మాత్రం టీమిండియాకి అదనపు బలం వస్తుంది...
Pakistan
ఆసియా కప్, శ్రీలంకలో జరుగుతోంది. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్, ఇండియాలో జరుగుతుంది. ఈ రెండు టోర్నీల్లోనూ ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగితే సరిపోతుంది. యజ్వేంద్ర చాహాల్ కంటే అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయగలడని అతన్ని ఎంపి చేశారు.నాకైతే ఇది కరెక్ట్ నిర్ణయంగానే అనిపిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ..