- Home
- Sports
- Cricket
- అక్తర్ సంగతి తర్వాత చూద్దాం.. ప్రస్తుతానికి నా దృష్టి అంతా దానిమీదే : ఉమ్రాన్ మాలిక్
అక్తర్ సంగతి తర్వాత చూద్దాం.. ప్రస్తుతానికి నా దృష్టి అంతా దానిమీదే : ఉమ్రాన్ మాలిక్
Umran Malik: ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15లో రాణించి ఏకంగా జాతీయ జట్టులో చోటు కొట్టేసిన ఉమ్రాన్ మాలిక్.. దక్షిణాఫ్రికాతో సిరీస్ లో టీ20 లలో అరంగేట్రం చేసే అవకాశముంది.

ఐపీఎల్-15లో తనదైన వేగంతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాలలో కీలక పాత్ర పోషించాడు ఉమ్రాన్ మాలిక్. ఈ జమ్మూ కుర్రాడు.. ఐపీఎల్ లో అదరగొట్టడంతో టీమిండియాలో చోటు దక్కింది. గంటకు 150 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బంతులు విసరడంలో మాలిక్ దిట్ట.
ఐపీఎల్ లో నిలకడగా 150 కి.మీ.కు తగ్గకుండా బంతులు విసరడంతో అందరూ అతడిని షోయభ్ అక్తర్ తో పోల్చారు. అక్తర్ ఫాస్టెస్ట్ డెలివరీ (గంటకు 161.3 కి.మీ) ని ఉమ్రాన్ అధిగమిస్తాడని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యలో ఉమ్రాన్ మాలిక్ స్పందించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా ఢిల్లీలో టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న మాలిక్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఉమ్రాన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతానికి నా ఫోకస్ ఆ రికార్డు (షోయభ్ అక్తర్ రికార్డు) మీద లేదు. నేను బాగా బౌలింగ్ చేయాలి. లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసరాలి. సౌతాఫ్రికాతో సిరీస్ లో నా దేశం ఐదు మ్యాచులు గెలిచేందుకు నా వంతుగా కృషి చేయాలి.
నేను 150 కి.మీ. వేగాన్ని మెయింటెన్ చేస్తాను. అందుకు నా బాడీని నేను స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి..’ అని తెలిపాడు. ఇక తాను నిలకడగా 150 కి.మీ. వేగంతో బంతులు విసరడానికి కారణం తన సహచర ఆటగాడు అబ్దుల్ సమద్ అన్నాడు ఉమ్రాన్.
‘సమద్ నన్ను బాగా మోటివేట్ చేసేవాడు. నేను అతడికి బౌలింగ్ చేసినప్పుడల్లా ఇంకా స్పీడ్ వేయమని నాకు సూచించేవాడు. దాంతో నేను మరింత వేగంగా బాల్స్ వేసేవాడిని. ఆ తర్వాత జిమ్, ఎక్సర్సైజ్ లతో నేను దృఢంగా మారడమే గాక అదే వేగాన్ని మెయింటెన్ చేస్తున్నాను..’ అని తెలిపాడు.
ఐపీఎల్ -15లో 14 మ్యాచులాడిన ఉమ్రాన్.. 22 వికెట్లు తీశాడు. ఇందులో ఓసారి ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. ఈ సీజన్ లో అతడి ఆటకు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా దక్కింది.