MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Sports
  • Cricket
  • ఎమ్మెస్ ధోనీ మొదలెట్టేశాడు... ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం చెన్నై చేరుకున్న మాహీ...

ఎమ్మెస్ ధోనీ మొదలెట్టేశాడు... ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం చెన్నై చేరుకున్న మాహీ...

ఐపీఎల్ 2021 సీజన్‌లో టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సారథి ఎమ్మెస్ ధోనీ, ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఫిబ్రవరి 12-13 తేదీల్లో జరిగే మెగా వేలం కోసం ఇప్పటికే చెన్నై చేరుకుని, టీమ్ మేనేజ్‌మెంట్‌తో చర్చలు సాగిస్తున్నాడు మాహీ...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Feb 03 2022, 07:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ఐపీఎల్ 2022 సీజన్‌ రిటెన్షన్‌లో భాగంగా కెప్టెన్ ఎమ్మెస్ ధోనీతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మొయిన్ ఆలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను అట్టిపెట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

రవీంద్ర జడేజాని ఫస్ట్ రిటెన్షన్‌గా రూ.16 కోట్లు చెల్లించబోతున్న సీఎస్‌కే, మాహీకి రూ.12 కోట్లు ఇవ్వబోతోంది. మొయిన్ ఆలీకి రూ.8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్‌కి రూ.6 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది...

311

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో 48 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ మొత్తంతో జట్టుని నిర్మించాల్సి ఉంటుంది. గత సీజన్‌లో అదరగొట్టిన ప్లేయర్లను తిరిగి జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది సీఎస్‌కే...

411

ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్‌లతో పాటు సీఎస్‌కే జట్టులో కీలక సభ్యుడిగా ఉంటూ వచ్చిన సురేష్ రైనా, అంబటి రాయుడు వంటి ప్లేయర్లను తిరిగి కొనుగోలు చేయాలని భావిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్...

511

‘అవును, ఎమ్మెస్ ధోనీ చెన్నైకి చేరుకున్నారు. ఆయన ఐపీఎల్ వేలం చర్చల్లో పాల్గొంటారు. అంతేకాకుండా వేలంలో సీఎస్‌కే తరుపున పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే వేలంలో సీఎస్‌కే బెంచ్‌లో ఉండాలా? వద్దా? అనేది మాహీ ఇష్టం...’ అంటూ తెలియచేసింది చెన్నై సూపర్ కింగ్స్..

611

40 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ, 2022 సీజన్ తర్వాత అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే మొదటి రిటెన్షన్‌గా కాకుండా రెండో రిటెన్షన్‌గా ఉండేందుకే మాహీ నిర్ణయం తీసుకున్నాడు...

711

ఎమ్మెస్ ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటాడని భావిస్తున్న రవీంద్ర జడేజాకి మొదటి రిటెన్షన్‌ ఇవ్వాలని మాహీయే సూచించినట్టు సమాచారం...

811

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్‌ని ఏకంగా రూ.9.25 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే అంత పెట్టి కొన్న గౌతమ్‌కి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు...

911

రూ.7 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మొయిన్ ఆలీని టాపార్డర్‌లో ఆడించిన ఎమ్మెస్ ధోనీ, ఛతేశ్వర్ పూజారాతో పాటు తెలుగు బౌలర్ హరిశంకర్ రెడ్డి, హరి నిశాంత్‌లకు కూడా అవకాశం ఇవ్వలేదు...

1011

చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్, ఈసారి ఐపీఎల్‌ 2022 సీజన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 2022 వేలానికి అతను రిజిస్టర్ చేయించుకోలేదు...

1111

ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలానికి 1418 ప్లేయర్లు రిజిస్టర్ చేయించుకోగా ఇందులో 270 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 903 అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, 41 మంది అసోసియేటెడ్ ప్లేయర్లు ఉన్నారు....

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved