19 సిక్సర్లు, 8 ఫోర్లు.. గేల్ రికార్డును బద్దలు కొట్టిన ఆయుష్ బదోని.. చితక్కొట్టుడు అంటే ఇదేనేమో
Ayush Badoni Breaks Chris Gayle's Six-Hitting Record : ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఆయుష్ బదోని అద్భుతమైన బ్యాటింగ్ తో 55 బంతుల్లో 165 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో ఏకంగా 19 సిక్సర్లు బాదాడు.
Ayush Badoni
Ayush Badoni Breaks Chris Gayle's Six-Hitting Record : ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ జోడీ ఆయుష్ బదోని -ప్రియాంష్ ఆర్య క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని ఇన్నింగ్స్ ను ఆడారు. డీపీఎల్ 2024 ఇద్దరు సెంచరీల మోత మోగిస్తూ కేవలం 99 బంతుల్లోనే 286 పరుగుల భాగస్వామ్యంతో సరికొత్త రికార్డు సృష్టించారు. శనివారం ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆయుష్ బదోని సునామీ ఇన్నింగ్స్ తో పరుగుల వరద పారించాడు. కేవలం 55 బంతుల్లో 165 పరుగులు ఇన్నింగ్స్ తో సరికొత్త రికార్డు సృష్టించాడు.
Ayush Badoni
ఆయుష్ బదోని తన 165 పరుగుల ఇన్నింగ్స్ లో ఏకంగా 19 సిక్సర్లు ఆదాడు. దీంతో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ టీ20 క్రికెట్ లో రెండో అత్యధిక స్కోరు (5 వికెట్లకు 308) సాధించింది. తన సూపర్ ఇన్నింగ్స్ తో ఆయుష్ బదోని 19 సిక్సర్లతో క్రికెట్ దిగ్గజాలు క్రిస్ గేల్, సాహిల్ చౌహాన్ల గత రికార్డులను బద్దలు కొట్టాడు. బదోని 55 బంతుల్లో 8 ఫోర్లు, 19 సిక్సర్లతో 165 పరుగులు చేయగా, అంతకుముందు టీ20 క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ లో 18 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు.
Priyansh Arya
2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రంగ్‌పూర్ రైడర్స్ తరఫున 69 బంతుల్లో 146 పరుగులు చేసిన క్రిస్ గేల్, ఈ సంవత్సరం ప్రారంభంలో సైప్రస్‌తో జరిగిన T20 ఇంటర్నేషనల్‌లో అదే ఫీట్ సాధించిన ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ సంయుక్తంగా ఈ రికార్డును (అత్యధిక సిక్సర్లు) కలిగి ఉన్నారు. ఆయుష్ బదోనితో పాటు ప్రియాంష్ ఆర్య కూడా సూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. ఆర్య 50 బంతుల్లో 120 పరుగుల తన ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లు, 100 ఫోర్లతో సహా 40 బంతుల్లో సెంచరీని అందుకున్నాడు. అతని సూపర్ ఇన్నింగ్స్ లో మనన్ భరద్వాజ్ వేసిన ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు.
Priyansh Arya, DPL 2024, DPL
టీ20 క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డును బదోని-ప్రియాంష్ ఆర్యలు బద్దలు కొట్టారు. రెండో వికెట్‌కు వారి 286 పరుగుల భాగస్వామ్యం ఈ ఏడాది ప్రారంభంలో చైనాపై జపాన్‌కు చెందిన లాచ్లాన్ యమమోటో-లేక్, కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ నెలకొల్పిన 258 పరుగుల రికార్డును అధిగమించింది. అలాగే, టీ20 క్రికెట్ లో రెండో అత్యధిక స్కోర్ కూడా డీపీఎల్ 2024 లో ఇదే మ్యాచ్ లో నమోదైంది. దక్షిణ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ మొత్తం 308/5 పరుగులు చేసింది. టీ20 చరిత్రలో అత్యధిక జట్టు మొత్తం కంటే కేవలం ఆరు పరుగుల దూరంలో నిలిచింది. అయితే, 2023 ఆసియా క్రీడల పురుషుల పోటీలో మంగోలియాపై నేపాల్ 314/3 పరుగులతో టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సాధించింది.