- Home
- Sports
- Cricket
- బుమ్రా కొత్త చరిత్ర.. ఆ దిగ్గజ బౌలర్ సరసన నిలిచిన పేస్ గుర్రం.. రికార్డులు చెల్లాచెదురు
బుమ్రా కొత్త చరిత్ర.. ఆ దిగ్గజ బౌలర్ సరసన నిలిచిన పేస్ గుర్రం.. రికార్డులు చెల్లాచెదురు
ENG vs IND: ఇంగ్లాండ్ తో మూడు మ్యాచుల వన్డేసిరీస్ లో భాగంగా తొలి వన్డేలో ఇంగ్లీష్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ జస్ప్రీత్ బుమ్రా సాగించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.

Image credit: Getty
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతం చేశాడు. ఇంగ్లాండ్ తో ‘ది ఓవల్’ వేదికగా జరుగుతున్న తొలివన్డేలో అతడు 6 వికెట్లతో ఇంగ్లీష్ జట్టును ఉతికారేశాడు. బుమ్రాకు టెస్టులతో పాటు వన్డేలలో ఇవే అత్యుత్తమ గణాంకాలు.
Image credit: Getty
ఈ మ్యాచ్ లో 7.2 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 19 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. తద్వారా బుమ్రా కొన్ని రికార్డులు తనపేరిట లిఖించుకున్నాడు.
ఇది అతడికి వన్డేలలో మూడో ఐదువికెట్ల ప్రదర్శన కాగా మొత్తంగా వన్డేలలో కెరీర్ బెస్ట్ ఫిగర్స్. ఈ క్రమంలో అతడు స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12) తర్వాత వన్డేలలో భారత జట్టు తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్ గా మూడో స్థానంలో నిలిచాడు.
ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ పై ఏ భారత బౌలర్ కైనా ఇవే అత్యుత్తమ గణాంకాలు. గతంలో ఆశిష్ నెహ్రా.. (6/23) డర్బన్ లో ఇంగ్లాండ్ ను గడగడలాడించాడు. కానీ అది డర్బన్ (దక్షిణాఫ్రికా) లో. కుల్దీప్ యాదవ్..6/25 తో (నాటింగ్హోమ్- ఇంగ్లాండ్ లోనే) తర్వాత స్థానంలో నిలిచాడు. ఈ రెండు రికార్డులు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయాయి.
ఇక ఇంగ్లాండ్ గడ్డపై వన్డేలలో అత్యధిక వికెట్లు నమోదుచేసిన వారి జాబితా (అంతర్జాతీయ క్రికెట్ లో) చూస్తే పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ (7/36.. ఇంగ్లాండ్ పై), విన్స్టన్ డేవిస్ (7/51.. వెస్టిండీస్-ఆసీస్ మ్యాచ్ లో), గ్యారీ గిల్మోర్ (6/14.. ఆసీస్-ఇంగ్లాండ్ మ్యాచ్ తొలి మూడు స్థానాల్లోఉన్నారు. ఈ జాబితాలో బుమ్రా నాలుగో స్థానంలో నిలిచాడు.
Jasprit Bumrah
బుమ్రా తన వన్డే కెరీర్ లో 70 మ్యాచులు ఆడి 113 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్ల ప్రదర్శ మూడు సార్లు ఉంది. ఇక టెస్టులలో మాత్రం బుమ్రా. 30 టెస్టులాడి 128 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్ లోఅతడు ఐదు వికెట్ల ప్రదర్శన 8 సార్లు చేశాడు. టెస్టులలో బుమ్రా బెస్ట్ ఫిగర్స్ 6/27 గా ఉంది.
ఇదిలాఉండగా.. ఇంగ్లాండ్ తో తొలి వన్డేలో పదివికెట్లు భారత పేసర్లే దక్కించుకున్నారు. ఇలా ఒక మ్యాచ్ లో పేసర్లు పది వికెట్లు దక్కించుకోవడం ఇండియాకు ఇది ఆరోసారి. గతంలో ఆస్ట్రేలియా (1983లో), వెస్టిండీస్ (1983లో), పాకిస్తాన్ (1997లో), దక్షిణాఫ్రికా (2003లో),బంగ్లాదేశ్ (2014లో) లో ఇలా జరిగింది. తాజాగా ఓవల్ లో బుమ్రా 6వికెట్లు తీయగా.. షమీ 3, ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు.