MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Sourav Ganguly: దాదా బయోపిక్.. డైరెక్ట్ చేయనున్న సూపర్ స్టార్ కూతురు..?

Sourav Ganguly: దాదా బయోపిక్.. డైరెక్ట్ చేయనున్న సూపర్ స్టార్ కూతురు..?

Sourav Ganguly Biopic: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీ  బయోపిక్ గురించి గత కొన్నాళ్లుగా  పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళ సూపర్ స్టార్  రజినీకాంత్ కూతురు ఆయనను డైరెక్ట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

2 Min read
Author : Srinivas M
Published : May 25 2022, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టీమిండియా మాజీ సారథి, కోల్కతా ప్రిన్స్ సౌరవ్ గంగూలీ జీవిత కథను కూడా వెండితెరపై చూడబోతున్నామా..?  ఆ మేరకు వెండితెర వెనకాల జరగాల్సిన పనులు (ప్రీ ప్రొడక్షన్) కూడా చకచకా జరుగుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఐపీఎల్-15 తో పాటు  బీసీసీఐ పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న దాదా.. తన జీవితానికి సంబంధించిన కీలక విషయాలు, ఆసక్తికర సంఘటనల గురించి కథకులతో చర్చిస్తున్నారని టాక్ నడుస్తున్నది.

39

తమిళ తలైవా, సూపర్ స్టార్  రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్.. గంగూలీ బయోపిక్ ను తెరకెక్కించే పనుల్లో ఉన్నట్టు సమాచారం.  ఈ మేరకు  ఆమె ఇప్పుడు  కోల్కతా వెళ్లడమే గాక గంగూలీతో కూడా సమావేశమైనట్టు తెలుస్తున్నది. 

49

ఇన్సైడ్ స్పోర్ట్స్ కథనం మేరకు.. దాదా  బయోపిక్ ను ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా  ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసిన ఐశ్వర్య అండ్ టీమ్..  మరింత సమాచార సేకరణ కోసం కోల్కతా కు  కూడా వెళ్లారు. 

59

కోల్కతాలో ఈడెన్ గార్డెన్ లో  ప్రస్తుతం ఐపీఎల్-2022 ప్లేఆఫ్స్ జరుగుతున్నాయి.  తన సొంత నగరం.. సొంత స్టేడియంలో జరుగుతున్న మ్యాచులను సమర్థవంతంగా నిర్వహించేందుకు గంగూలీ  దగ్గరుండి  పనులన్నీ చూసుకుంటున్నాడు. ఈ గ్యాప్ లోనే ఆయన.. ఐశ్వర్యతో మంగళవారం రాత్రి డిన్నర్ కూడా చేసినట్టు తెలుస్తున్నది.  
 

69

తన సినిమాకు సంబంధించిన ఇన్పుట్స్  తీసుకోవడానికే ఐశ్వర్య.. గంగూలీని కలిసిందని  చెబుతుండగా.. మరికొంతమందేమో అలాంటిదేమీ లేదని.. ఆమె ఐపీఎల్ ను  చూడటానికే తన పిల్లలతో కలిసి కోల్కతాకు వెళ్లిందని కూడా అంటున్నారు. మరి ఇందులో నిజమేంటనేది కొద్దిరోజుల్లో తేలనుంది. 

79

బాలీవుడ్ లో కొన్నాళ్లుగా బయోపిక్ ల తంతు నడుస్తున్న విషయం తెలిసిందే. ధోని, సచిన్,  కపిల్ దేవ్ (83 ప్రపంచకప్  నేపథ్యం), మిల్కా సింగ్ (భాగ్ మిల్కా భాగ్) ల జీవితాల మీద  సినిమాలు వస్తున్న నేపథ్యంలో గంగూలీ బయోపిక్ కూడా  వస్తే బాగుంటుందని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. 

89

ఇదే విషయమై గతేడాది మార్చిలో దాదా కూడా తన ట్విటర్ వేదికగా.. లవ్ ఫిలిమ్స్ తన బయోపిక్ ను ప్రొడ్యూస్ చేయడానికి ఆసక్తి చూపిస్తుందని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను లవ్ రంజన్ డైరెక్ట్ చేస్తాడని కూడా అందులో పేర్కొన్నాడు. అయితే ఇంతవరకు దాని గురించిన అప్టేడ్ బయటకు రాలేదు.  

99

కానీ తాజాగా దాదా బయోపిక్ ను డైరెక్ట్ చేయనున్నట్టు ఐశ్వర్య పేరు వినిపిస్తుంటం గమనార్హం. ఐశ్వర్య 2010 లో ధనుష్, శృతి హాసన్ లు హీరోహీరోయిన్లుగా ‘3’ సినిమాను డైరెక్ట్ చేసింది. ఆ తర్వాత ‘వాయ్ రాజా వాయ్’ తో పాటు ‘సినిమా వీరన్’ అనే  డాక్యుమెంటరీ కూడా తీసింది. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Purple Cap Winner: రబాడ చేతికి పర్పుల్ క్యాప్.. హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న భువనేశ్వర్ !
Recommended image2
Vaibhav Sooryavanshi : ధోనీలాగే వైభవ్ కూడా లీటర్లకొద్ది పాలు తాగుతాడా..?
Recommended image3
IPL 2026 Final: గిల్ ప్లాన్ రివర్స్.. గుజరాత్ టైటాన్స్‌ను ఓడిపోవడానికి టాప్ 5 కారణాలు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved