IPL: విరాట్ కోహ్లీ గాయం ఎలా ఉంది? తర్వాతి మ్యాచ్‌లో ఆడతాడా?
Virat Kohli Injury Update: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. అయితే, ఇప్పుడు కోహ్లీ గాయం ఎలా ఉంది? తర్వాతి మ్యాచ్ ఆడతాడా? లేదా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

IPL : Virat Kohli Injury Update Will He Play Next Match rcb
Virat Kohli Injury Update:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. లియోమ్ లివింగ్‌స్టన్ 40 బంతుల్లో 51 పరుగులు చేశాడు. గుజరాత్ తరపున ముహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
Virat Kohli Injury Update Will He Play Next Match rcb
ఆ తర్వాత అద్బుతమైన ఆటతో లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ టైటాన్స్ జట్టు 17.5 ఓవర్లలో 170 పరుగులు చేసి విజయం సాధించింది. జోస్ బట్లర్ 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. ఆర్సీబీ, గుజరాత్ జట్లు చెరో మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో విజయం సాధించి ఒక మ్యాచ్‌లో ఓడిపోయాయి.
అయితే, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తుండగా చేతికి గాయమైంది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 12వ ఓవర్లో విరాట్ కోహ్లీ బౌండరీని ఆపడానికి ప్రయత్నించినప్పుడు అతను గాయపడ్డాడు. మైదానంలో సూపర్ ఫీల్డింగ్ ప్రదర్శించే విరాట్ కోహ్లీ, డీప్ మిడ్‌వికెట్‌లో డైవ్ చేశాడు. కానీ బంతి అతని చేతులను తాకుడూ బౌండరీకి వెళ్లింది. అయితే బంతి తగలడంతో విరాట్ కోహ్లీ వేలికి గాయమైంది.
Virat Kohli Injury Update
దీంతో ఆర్సీబీ జట్టు ఫిజియో వెంటనే వచ్చి నొప్పి నివారణ చికిత్స చేశారు. విరాట్ కోహ్లీ గాయం తీవ్రంగా ఉందని, అతను తర్వాతి కొన్ని మ్యాచ్‌లలో ఆడే అవకాశం లేదని రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే, తాజాగా కోహ్లీ గాయంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ అప్‌డేట్ ఇచ్చారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ గాయం తీవ్రంగా ఉందా అని ఆండీ ఫ్లవర్‌ను అడగగా, ఆయన ఆ ఆందోళనలను పక్కనపెట్టి కోహ్లీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు.
''విరాట్ కోహ్లీ ఆరోగ్యంగా ఉన్నాడు. అంతా సర్దుకుంది'' అని ఆండీ ఫ్లవర్ తెలిపారు. దీంతో ఆర్సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుత ఐపీఎల్ సిరీస్‌లో కోహ్లీ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేదు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పరుగులు చేయడానికి కష్టపడిన కోహ్లీ, జీటీతో మ్యాచ్‌లో కేవలం 6 పరుగులకే అవుటయ్యాడు. కోహ్లీ పేలవమైన ఫామ్ కొనసాగుతుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమైంది. కీలక ఆటగాళ్లు ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా మొత్తం మీద విఫలమయ్యారు. దీంతో ఆర్సీబీ బలమైన స్కోరును అందుకోలేకపోవడంతో ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా మారింది.
ఈ ఓటమి తర్వాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ మాట్లాడుతూ, ''190 పరుగులు చేసి ఉంటే బాగుండేది. కానీ పవర్‌ప్లేలో కీలక వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరును అందుకోలేకపోయాం. 3 వికెట్లు కోల్పోయిన తర్వాత జితేష్ శర్మ, లియోమ్ లివింగ్‌స్టన్, టిమ్ డేవిడ్ అద్భుతంగా ఆడారు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. మా బౌలర్లు బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. వారు కష్టపడి పనిచేశారు'' అని తెలిపాడు.