'గోట్'మూవీలో ఎంఎస్ ధోని-థియేటర్లలో గూస్‌బంప్స్ ! అదిరిపోయిందిగా
MS Dhoni-Thalapathy Vijay's GOAT: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా 'గోట్' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్-GOAT) సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో భారత క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని కనిపించడం అభిమానులను థ్రిల్ చేస్తోంది.
dhoni vijay
MS Dhoni-Thalapathy Vijay's GOAT: భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దళపతి నటించిన 'గోట్' (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) గురువారం (5 సెప్టెంబర్ 2024న) విడుదలైంది. తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించగా, వారిలో పాటు భారీ తారాగణంతో నిర్మించారు.
ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులు-విమర్శకుల నుండి సానుకూల రివ్యూలను అందుకుంటుంది. ప్రత్యేక ఉగ్రవాద నిరోధక దళం (SATS)లో గాంధీ అనే గూఢచారి ఏజెంట్ తన పదవీ విరమణ చేసిన సంవత్సరాల తర్వాత సవాళ్లను ఎదుర్కొంటాడు. 2004లో జరిగిన మాస్కో మెట్రో బాంబింగ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
విజయ్ మొదట గాంధీగా, తర్వాత కొడుకుగా ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు. గోట్ సినిమాలోని స్టార్ కాస్ట్‌లో మీనాక్షి చౌదరి, ప్రశాంత్ త్యాగరాజన్, ప్రభుదేవా, మోహన్ కీలక పాత్రలు పోషించారు. సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం, ఈ చిత్రం తొలిరోజు భారత్ తో దాపు రూ.55 కోట్ల నికరాన్ని రాబట్టింది.
అయితే, దళపతి విజయ్ నటించిన గోట్ సినిమాలో భారత క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని కనిపించాడు. ధోని కొద్ది సేపు స్క్రీన్ పై కనిపించే దృశ్యాలు అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. థియేటర్లలో సందడి చేస్తున్న GOAT లో ధోని అతిధి పాత్రతో కనిపిస్తాడనే విడుదలకు ముందు చాలా త్వరగా అందరి దృష్టిని ఆకర్షించింది.
dhoni vijay
ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఎంఎస్ ధోని ఇండియాన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ఆడుతున్నాడు. విజయవంతమైన కెప్టెన్ గా చెన్నై టీమ్ ను ముందుకు నడిపించిన ధోని ఇప్పటివరకు ఐదు సార్లు సీఎస్కేను ఛాంపియన్ గా నిలబెట్టాడు.
తమిళనాడుతో ప్రత్యేక అనుబంధం ఉంది. తమిళనాడుకు ఎంతో ఇష్టమైన క్రికెటర్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చాలా సార్లు తమిళనాడు "దత్తపుత్రుడు" అని పేర్కొన్నాడు. అక్కడి వారు ధోనిని 'థాలా' అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పుడు విజయ్ చిత్రంలో ధోని కనిపించడం థియేటర్లలో గూస్‌బంప్స్ తీసుకువస్తోంది.
అయితే, చిత్ర యూనిట్ ముందు చెప్పినట్టుగా ధోని అతిథి పాత్రలో కనిపించలేదు. కానీ, థాలా ఐపీఎల్ మ్యాచ్ సన్నివేశంలో విజయ్ తో కలిపి కనిపిస్తాడు. ఇది థియేటర్ లో అభిమానులను థ్రిల్ చేస్తోంది. ఒకే సారి ఇద్దరు స్టార్లు బిగ్ స్క్రీన్ పై కనిపించడంతో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ధోని మరో స్క్రీన్ లో కనిపించినప్పటికీ ఉనికి ప్రధాన హైలైట్‌గా నిలిచింది.
ఐకానిక్ చెపాక్ స్టేడియం పైకప్పుపై నుంచి దూసుకువచ్చి సూపర్ స్టార్ దళపతి విజయ్ విలన్‌ని పడగొట్టడం, అక్కడ ధోని కూడా కనిపించే గోట్ సన్నివేశం థియేటర్లలో విజిల్స్ మోగిస్తోంది. 'GOAT'లోని షార్ట్ సీన్ లో విజయ్ క్రికెట్ గ్రౌండ్ లో ఒక స్టంట్ చేసే సమయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కోసం బ్యాటింగ్ చేయడానికి ఎంఏ చిదంబరం స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్ నుండి ధోని బయటకు వస్తున్నట్లు చూపించారు. అలాగే, ఆ తర్వాత ధోని బౌండరీని కూడా కొట్టాడు.
dhoni vijay
పెద్ద స్క్రీన్‌పై ఇద్దరు ఐకాన్ స్టార్ల దృశ్యాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. వారి స్పందన క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ధోని ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి లీగ్ మ్యాచ్ లలో ఆడుతున్నాడు. ఐపీఎల్ లో చెన్నై టీమ్ ను నడిపించాడు. ఐదు సార్లు ఆ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు.
ప్లేయర్ గా, భారత కెప్టెన్‌గా టీమిండియాకు అనేక విజయాలు అందించాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో సహా మూడు ఐసీసీ టైటిళ్లను గెలిపించాడు. గత సీజన్ లో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు అప్పగించాడు.
The GOAT advance sale collection report out
'గోట్' సినిమా విజయ్ కెరీర్ లో చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమా విడుదలకు ముందు ఆయన రాజకీయ పార్టీని ప్రకటించారు. పూర్తిగా రాజకీయాల్లో ఉండటంతో ఇదే ఆయనకు చివరి చిత్రం అనే టాక్ కూడా నడుస్తోంది. దీంతో అన్ని వర్గాల నుంచి ఆసక్తిని పెంచింది. ఇప్పుడు థియేటర్లలో మంచి టాక్ తో గోట్ మూవీ నడుస్తోంది. రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది.
విజయ్ దళపతి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తమిళ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించి, AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు భారతదేశం అంతటా రూ. 55 కోట్లు రాబట్టి, తమిళ చిత్రాలకు కొత్త బెంచ్‌మార్క్‌ని నెలకొల్పింది.