MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: ఆర్సీబీ ఈసారైనా ఐపీఎల్ కప్ గెలుస్తుందా? ఏబీ డివిలియర్స్ యాక్షన్ కు కోహ్లీ రియాక్షన్ ఏంటో తెలుసా?

IPL 2025: ఆర్సీబీ ఈసారైనా ఐపీఎల్ కప్ గెలుస్తుందా? ఏబీ డివిలియర్స్ యాక్షన్ కు కోహ్లీ రియాక్షన్ ఏంటో తెలుసా?

IPL 2025 RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకునే అవకాశాలపై సౌతాఫ్రికా లెజెండ్, ఆర్సీబీ మాజీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కామెంట్స్ చేయగా.. విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్ గా మారింది.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 19 2025, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
IPL 2025: Will RCB win the IPL cup this time? Do you know virat Kohli's reaction to AB de Villiers' action?

IPL 2025: Will RCB win the IPL cup this time? Do you know virat Kohli's reaction to AB de Villiers' action?

IPL 2024 Royal Challengers Bangalore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025కి సర్వం సిద్ధమైంది. మార్చి 22 నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025లో తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. 

ప్రతిసారి కప్ గెలిచేది తామే అంటూ బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీకి ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. ఇదే క్రమంలోనే సౌతాఫ్రికా లెజెండ్, ఆర్సీబీ మాజీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఈ ఏడాది ఆర్సీబీ తమ తొలి ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకోవడంపై కామెంట్స్ చేశారు. చాలా కాలంగా బెంగళూరు టీమ్ కు అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకోవడంలో ఉన్న కష్టం ఏంటో వివరించారు డివిలియర్స్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
IPL 2025: Will RCB win the IPL cup this time? Do you know virat Kohli's reaction to AB de Villiers' action?

IPL 2025: Will RCB win the IPL cup this time? Do you know virat Kohli's reaction to AB de Villiers' action?

ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలుపు అంశంపై ఏబీ డివిలియర్స్ ఏం చెప్పారంటే? 

ఐపీఎల్ టైటిల్ గెలుపులో ఉండే సవాళ్లను ఏబీ డివిలియర్స్ ప్రస్తావించారు. 10 ప్రపంచ స్థాయి జట్ల ఉనికి, ప్రయాణంలో  అలసట, ఆటగాళ్ల - జట్ల గాయాలు, ప్రతికూల పరిస్థితులను ప్రస్తావించారు. "ఐపీఎల్ గెలవడం చాలా కష్టం. ఐపీఎల్ సంగతి పక్కన పెడితే, ప్రపంచ కప్ కూడా గెలవగల 10 ప్రపంచ స్థాయి జట్లు ఉన్నాయి. ఆ టీమ్స్ ప్రయాణం, జట్టు వ్యూహాలు, గాయాలు, సీజన్ అంతటా విభిన్న పరిస్థితులకు అనుగుణంగా ఉండటం వంటి అనేక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. టోర్నమెంట్ చివరి వరకు టీమ్ బలం, ప్రారంభంలో ఉన్న వేగాన్ని చివరివరకు కొనసాగించగల జట్టు మాత్రమే అగ్రస్థానంలో ఉంటుంది. టీమ్ గా ఆడే జట్లు బాగా రాణిస్తాయి" అని జియో హాట్‌స్టార్‌లో ఏబీ డివిలియర్స్ అన్నారు.

35
IPL 2025: Will RCB win the IPL cup this time? Do you know virat Kohli's reaction to AB de Villiers' action?

IPL 2025: Will RCB win the IPL cup this time? Do you know virat Kohli's reaction to AB de Villiers' action?

ఐపీఎల్ 2025 టైటిల్ ను ఆర్సీబీ గెలుస్తుంది ! 

ఈసారి ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌ను గెలుస్తుందని ఏబీ డివిలియర్స్ ఆశించారు. ఐపీఎల్ 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీల్ 2025 ట్రోఫీని గెలుస్తుందనీ, విరాట్ కోహ్లీ 18వ నంబర్ జెర్సీ ధరించి ఈ విజయానికి నాయకత్వం వహిస్తాడని ఏబీ డివిలియర్స్ అన్నారు. 

"ఇది 18వ సీజన్.. జట్టులో 18వ నంబర్ (విరాట్ కోహ్లీ) ఉన్నాడు. ఆర్సీబీ ఐపీఎల్ గ్రోఫీని గెలిస్తే నేను విరాట్‌ కోహ్లీతో కలిసి అక్కడ సంబరాలు చేసుకుంటాను!" అని మిస్టర్ 360°గా ప్రసిద్ధి చెందిన డివిలియర్స్ అన్నారు. 

45
IPL 2025: Will RCB win the IPL cup this time? Do you know virat Kohli's reaction to AB de Villiers' action?

IPL 2025: Will RCB win the IPL cup this time? Do you know virat Kohli's reaction to AB de Villiers' action?

కోహ్లీ ఇప్పుడే వద్దని చెప్పాడు : ఏబీ డివిలియర్స్  

అలాగే, ఐపీఎల్ ట్రోఫీ గెలవడం పై తాను చెప్పిన విషయాలు ప్రస్తావించిన ఏబీ డివిలియర్స్.. తనతో కోహ్లీ ముందుగానే ఐపీఎల్ టైటిల్ మనదే అనే స్లోగన్స్ వద్దని చెప్పారని వివరించాడు. "ఈ సాలా కప్ నమ్దే" (ఈసారి కప్పు మనదే) అని పదే పదే తాను చెప్పి విరాట్ కోహ్లీతో ఇబ్బందుల్లో పడ్డానని తెలిపాడు.

"నేను మొన్న 'ఈ సాలా కప్ నమ్దే' అన్నాను, విరాట్ నుండి నాకు డైరెక్ట్ మెసేజ్ వచ్చింది. కోహ్లీ నాకు 'దయచేసి, ఇప్పుడే అలా అనడం ఆపండి' అని చెప్పాడు. అది చూసి నేను కొంచెం ఇబ్బంది పడ్డాను! నిజం చెప్పాలంటే, నేను ఎప్పుడూ అలా చెప్పి నిరాశపడుతున్నాను" అని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ అన్నారు.

55
IPL 2025: Will RCB win the IPL cup this time? Do you know virat Kohli's reaction to AB de Villiers' action?

IPL 2025: Will RCB win the IPL cup this time? Do you know virat Kohli's reaction to AB de Villiers' action?

ఐపీఎల్ 2025 ఆర్సీబీ స్క్వాడ్: 

రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ స్వేఖ్ భండాగే, జాకబ్ బండెక్, లుంగీ ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాథీ.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
బెంగళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved