MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • GT vs PBKS: ధోని, కోహ్లీ క్లబ్ లోకి శ్రేయాస్ అయ్యర్.. కెప్టెన్ గా కొత్త రికార్డు

GT vs PBKS: ధోని, కోహ్లీ క్లబ్ లోకి శ్రేయాస్ అయ్యర్.. కెప్టెన్ గా కొత్త రికార్డు

IPL 2025, GT vs PBKS: గత సీజన్ ఛాంపియన్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్‌ను ట్రోఫీని గెలుచుకునేలా నడిపించాలనే ల‌క్ష్యంతో గ్రౌండ్ లోకి దిగాడు.తొలి మ్యాచ్‌లోనే అతను తన ఉద్దేశాలను స్పష్టం చేస్తూ రికార్డుల మోత మోగించాడు. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Mar 25 2025, 10:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

IPL 2025, GT vs PBKS: పంజాబ్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్ గా వచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తన తొలి మ్యాచ్ లోనే అద్భుత‌మైన నాక్ తో అద‌ర‌గొట్టాడు. ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ శుభ్ మ‌న్ గిల్ నాయ‌క‌త్వంలోని గుజ‌రాత్ టైటాన్స్ ను చెడుగుడు ఆడుకున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న ఐపీఎల్ కెరీర్ లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ ను న‌మోదుచేశాడు. 42 బంతుల్లో 97 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. త‌న తుఫాన్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 9 సిక్స‌ర్లు బాదాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Shreyas Iyer joins Virat Kohli, MS Dhoni among others in elite IPL record list

Shreyas Iyer joins Virat Kohli, MS Dhoni among others in elite IPL record list

అలాగే, శ్రేయాస్ అయ్య‌ర్ ఐపీఎల్ లో 2000 పరుగులు సాధించిన 7వ‌ ఐపీఎల్ కెప్టెన్ ఘ‌న‌త సాధించాడు. దీంతో ఈ ప్ర‌త్యేక ఎలైట్ గ్రూప్ లో ఉన్న విరాట్ కోహ్లీ , ఎంఎస్ ధోని , రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ ల‌తో  చేరాడు. 

ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా విరాట్ కోహ్లీ టాప్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో కోహ్లీ కెప్టెన్ గా 4994 పరుగులు చేశాడు. రెండో స్థానంలో ఉన్న ఎంఎస్ ధోని 4660 పరుగులు చేశాడు. 3986 పరుగులతో రోహిత్ శర్మ 3వ స్థానంలో, గంభీర్ 3518 పరుగులతో 4వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ 3356 పరుగులు చేయగా, 6వ స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్ 2691 పరుగులు చేశాడు. 

33
Shreyas Iyer joins Virat Kohli, MS Dhoni among others in elite IPL record list

Shreyas Iyer joins Virat Kohli, MS Dhoni among others in elite IPL record list

అలాగే, ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లకు నాయకత్వం వహించిన 4వ క్రికెటర్ గా అయ్యర్ నిలిచాడు. అంతకుముందు మహేల జయవర్ధనే ఈ రికార్డును సృష్టించిన తొలి ప్లేయర్ గా ఉన్నాడు. అతని తర్వాత కుమార్ సంగక్కర, స్టీవ్ స్మిత్ ఉన్నారు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి అయ్యర్ అద్భుతమైన ఆటను మ్యాచ్ చివరివరకు కొనసాగించాడు.

27 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ 14వ ఓవర్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్ తో అద్భుతమైన సిక్సర్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఐపీఎల్ లో అయ్యర్ కు ఇది 28వ హాఫ్ సెంచరీ. అలాగే, ఒక ఫ్రాంచైజీకి కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోరు సాధించిన రెండో కెప్టెన్ గా నిలిచాడు. 

ఒక ఫ్రాంచైజీకి కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోరు

119 - సంజు శాంసన్ RR vs PBKS, వాంఖడే, 2021
99* - మయాంక్ అగర్వాల్ PBKS vs DC, అహ్మదాబాద్, 2021
97* - శ్రేయాస్ అయ్యర్ PBKS vs GT, అహ్మదాబాద్, 2025*
93* - శ్రేయాస్ అయ్యర్ DC vs KKR, ఢిల్లీ, 2018
88 - ఫాఫ్ డు ప్లెసిస్ RCB vs PBKS, ముంబై, 2022

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image2
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image3
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved