MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ 2025 : స్టార్ ప్లేయ‌ర్లకు షాక్ - ఢిల్లీ క్యాపిట‌ల్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరో తెలుసా?

ఐపీఎల్ 2025 : స్టార్ ప్లేయ‌ర్లకు షాక్ - ఢిల్లీ క్యాపిట‌ల్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరో తెలుసా?

IPL 2025 - Delhi Capitals : ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టులో భారీ మార్పులు క‌నిపించ‌నున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ జట్టు రిటైన్ చేసుకునే ప్లేయర్ల గురించి భారీ అప్డేట్ ఇచ్చాడు. రిషబ్ పంత్ ను ఢిల్లీ జట్టు రిటైన్ చేసుకుంటుందా? ఈ వివ‌రాలు మీకోసం 

3 Min read
Mahesh Rajamoni
Published : Oct 05 2024, 05:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Rishabh Pant, Pant, Axar Patel, David Warner, DC, IPL 2025

Rishabh Pant, Pant, Axar Patel, David Warner, DC, IPL 2025

IPL 2025 - Delhi Capitals : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజ‌న్ కు ముందు ఆట‌గాళ్ల కోసం మెగా వేలం జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు అన్ని ఫ్రాంఛైజీల‌తో చ‌ర్చించిన భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ఆటగాళ్ల రిటెన్ష‌న్, ఐపీఎల్ వేలం, రాబోయే సీజ‌న్ కు సంబంధించి కొన్ని నిర్ణ‌యాలు ప్ర‌క‌టించింది. ఐపీఎల్ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌స్తుతం టీమ్ లో ఉన్న ఆరుగురు ప్లేయ‌ర్ల‌ను రిటైన్ చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే అన్ని జ‌ట్లు ఏఏ ఆట‌గాళ్ల‌ను ఉంచుకోవాల‌నే దానిపై క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. ఢిల్లీ టీమ్ కు సంబంధించి బిగ్ అప్ డేట్ వ‌చ్చింది.

25
IPL 2024: Will Delhi Capitals retain Rishabh Pant?

IPL 2024: Will Delhi Capitals retain Rishabh Pant?

రిష‌బ్ పంత్ ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ రిటైన్ చేసుకుంటుందా? 

ఢిల్లీ క్యాపిటల్స్ సహ-యజమాని పార్త్ జిందాల్ జట్టులో ప్లేయ‌ర్ల రిటెన్ష‌న్ గురించి చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి. ఆయ‌న జ‌ట్టుతో నిలుపుకునే ప్లేయ‌ర్ల గురించి కీల‌క అప్ డేట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ గా ఉన్న రిష‌బ్ పంత్ రాబోయే సీజ‌న్ లో జ‌ట్టులో ఉండాటా?  లేదా అనేది కొంత కాలంగా క్రికెట్ స‌ర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. 

దీనిపై  పార్త్ జిందాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఖచ్చితంగా రిటైన్ చేస్తామ‌ని చెప్పారు. దీంతో రాబోయే ఐపీఎల్ లో రిష‌బ్ పంత్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌ఫున ఆడ‌తాడ‌ని స్ప‌ష్టం అయింది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఐపీఎల్ 2025 వేలానికి ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇటీవల నిబంధనలను ప్రకటించింది. ఒక ఫ్రాంచైజీ రైట్-టు-మ్యాచ్ ఎంపికతో గరిష్టంగా 6 మంది ఆటగాళ్లను జ‌ట్టుతో ఉంచుకోవ‌చ్చు. ఫ్రాంచైజీలు తమ రిటెన్ష‌న్ల జాబితాను సమర్పించడానికి అక్టోబర్ 31ను చివ‌రి తేదీగా పేర్కొంది బీసీసీఐ. 

35
IPL 2024 : Will Axar Patel and Kuldeep Yadav be part of the Delhi team?

IPL 2024 : Will Axar Patel and Kuldeep Yadav be part of the Delhi team?

అక్షర్ పటేల్ - కుల్దీప్ యాదవ్ లు ఢిల్లీ టీమ్ లోనే ఉంటారా? 

ఢిల్లీ క్యాపిట‌ల్స్ గురించి ఆ టీమ్ స‌హ‌య‌జ‌మాని పార్త్ జిందాల్ మాట్లాడుతూ.. "అవును, మేము ఖచ్చితంగా  రిష‌బ్ పంత్ ను నిలబెట్టుకోవాలి. మా జట్టులో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు రిటెన్ష‌న్ కోసం కొత్త‌ నియమాలు వచ్చాయి. కాబట్టి జీఎంఆర్, మా క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో చర్చించిన తర్వాత పూర్తిస్తాయి నిర్ణయాలు తీసుకుంటారు. రిషబ్ పంత్ ఖచ్చితంగా జ‌ట్టులో ఉంటారు. అన్ని రిటైన్ చేసుకుంటాం" అని చెప్పిన వీడియో కూడా వైర‌ల్ గా మారింది. 

ఆ వీడియోలో పార్త్ జిందాల్ ఇంకా మాట్లాడుతూ.. "మా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారిలో అక్షర్ పటేల్ , ట్రిస్టన్ స్టబ్స్ , జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ , కుల్దీప్ యాదవ్ , అభిషేక్ పోరెల్ , ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ కూడా ఉన్నారు. వేలంలో ఏమి జరుగుతుందో చూద్దాం. అయితే మొదట నిబంధనల ప్రకారం మేము చర్చల తర్వాత ప్లేయ‌ర్ల‌ను ఎంపిక చేసుకుంటాం. ఆ త‌ర్వాత ఐపీఎల్ వేలం గురించి ఆలోచ‌న ఉంది. రాబోయే మెగా వేలంలో ఏం జ‌రుగుతుందో చూద్దాం" అని పేర్కొన్నారు.

45
IPL 2025 : Will Delhi Capitals give a shock to David Warner?

IPL 2025 : Will Delhi Capitals give a shock to David Warner?

ఢిల్లీ క్యాపిట‌ల్స్ డేవిడ్ వార్న‌ర్ కు షాక్ ఇస్తుందా? 

పార్త్ జిందాల్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ రిటెన్ష‌న్ ప్లేయ‌ర్ల గురించి ప్ర‌స్తావించిన‌ప్పుడు ముందుగా భార‌తీయ ప్లేయ‌ర్ల పేర్లు వ‌చ్చాయి. అయితే, అనూహ్యంగా జిందాల్ ప్ర‌స్తావించిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌కు పెట్టింది పేరైన‌ డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కలేదు. అంటే రాబోయే ఐపీఎల్ 2025 సీజ‌న్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ డేవిడ్ వార్న‌ర్ ను వేలంలోకి వ‌దిలేస్తుందా? అనే చ‌ర్చ మొద‌లైంది. 

జిందాల్ ప్ర‌స్తావించిన‌ట్టుగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుతో ఉంచుకునే ప్లేయ‌ర్ల‌లో భార‌త స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ రిష‌బ్ పంత్ ముందుంటారు. ఆ త‌ర్వాత అక్ష‌ర్ ప‌టేల్ ను కూడా ఢిల్లీ ఉంచుకుంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ అద్భుతాలు చేయ‌డంతో అక్ష‌ర్ ప‌టేల్ మ‌స్తు డిమాండ్ ఉన్న ప్లేయ‌ర్ గా మారాడు. ఆ త‌ర్వాత ఢిల్లీ టీమ్ లోని ప్లేయ‌ర్ల‌లో ట్రిస్టన్ స్టబ్స్ , జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ , కుల్దీప్ యాదవ్ , అభిషేక్ పోరెల్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ లు ఉన్నారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ విదేశీ ప్లేయ‌ర్ల లిస్టు పూర్తిగా మారుతుంద‌ని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

55
How will Delhi Capitals fare in IPL 2024 under Rishabh Pant's captaincy?

How will Delhi Capitals fare in IPL 2024 under Rishabh Pant's captaincy?

రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2024 లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉంది? 

ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. టోర్నమెంట్‌లో వారు ఆడిన 14 మ్యాచ్‌లలో ఏడింటిలో విజయం సాధించారు. మ‌రో ఏడు మ్యాచ్ ల‌లో ఓడిపోయారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సమాన పాయింట్లు ఉన్నాయి. అయితే తక్కువ నికర రన్ రేట్ (NRR) కారణంగా ప్లేఆఫ్స్‌లో చోటు కోల్పోయింది. ఐపీఎల్ లో 2021 ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చివరిసారిగా ప్లేఆఫ్‌కు చేరుకుంది.

ఐపీఎల్ 2024 లో ఢిల్లీ క్యాపిటల్స్ త‌ర‌ఫున ఆడిన జ‌ట్టులో ఉన్న భారత ప్లేయ‌ర్ల‌లో రిషబ్ పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ , పృథ్వీ షా, ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, ముఖేష్ కుమార్, యశ్ ధుల్, విక్కీ ఓస్త్వాల్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా , సుమిత్ కుమార్, రాసి స్వస్తిక్ చికారా ఉన్నారు. ఇక ఓవర్సీస్ ప్లేయ‌ర్ల విష‌యానికి వ‌స్తే డేవిడ్ వార్నర్ , మిచెల్ మార్ష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి , జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ట్రిస్టన్ స్టబ్స్, ఝీ రిచర్డ్‌సన్, షాయ్ హోప్ లు ఉన్నారు.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
క్రికెట్
రిషబ్ పంత్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved