- Home
- Sports
- Cricket
- మ్యాచ్ మొదలయ్యాక అక్కడ నీకేం పని! నువ్వేం ఫుట్‌బాల్ కోచ్‌వి కాదు... ఆశీష్ నెహ్రాపై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...
మ్యాచ్ మొదలయ్యాక అక్కడ నీకేం పని! నువ్వేం ఫుట్‌బాల్ కోచ్‌వి కాదు... ఆశీష్ నెహ్రాపై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...
ఐపీఎల్ 2023 సీజన్‌ని బ్యాంగ్ బ్యాంగ్ విజయాలతో ఆరంభించిన గుజరాత్ టైటాన్స్‌కి, కేకేఆర్‌తో మ్యాచ్‌లో రింకూ సింగ్ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిమ్రాన్ హెట్మయన్ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో మరో దెబ్బ తగిలింది. గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాపై ఫైర్ అయ్యాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

ఆశీష్ నెహ్రాతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. గుజరాత్ టైటాన్స్‌కి హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆశీష్ నెహ్రాపై ఎలాంటి అంచనాలు లేవు. అయితే ఎవ్వరూ ఊహించనట్టుగా మొదటి సీజన్‌లోనే టైటాన్స్‌ని టైటిల్ విజేతగా నిలిపాడు ఆశీష్ నెహ్రా..
‘ఆశీష్ నెహ్రాని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అతనికి ఉండే అత్యుత్సాహం గురించి నాకు బాగా తెలుసు. అందుకే స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ వరకూ ఆపుకోలేక బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్‌తో మాట్లాడుతున్నాడు. అయితే ఇది ఫుట్‌బాల్ మ్యాచ్ కాదు...
హెడ్ కోచ్ అయినా సరే మ్యాచ్ మొదలయ్యాక డగౌట్‌లో కూర్చోవాల్సిందే. ఇలా మ్యాచ్ సమయంలో ఆటగాళ్లతో మాట్లాడడం వల్ల వారిలో ఒత్తిడి పెరుగుతుంది. మహ్మద్ షమీ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆశీష్ నెహ్రా వచ్చి ఏదో చెప్పాడు. ఆ తర్వాత అతను ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు ఇచ్చేశాడు..
PTI Photo/Manvender Vashist Lav)(PTI04_13_2023_000420B)
మ్యాచ్‌కి ముందు ఎన్ని ప్లాన్స్ అయినా వేసుకోవచ్చు, ఎన్ని ప్రణాళికలైనా రచించొచ్చు. అయతే ఒక్క సారి గేమ్ మొదలయ్యాక ప్లేయర్లపైన భరోసా ఉంచాలి. వారిని స్వేచ్ఛగా ఆడనివ్వాలి. ప్రతీ దాంట్లో కలగచేసుకుంటే ప్లేయర్లు ఫ్రీగా ఆడలేరు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..
ashish
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్, తన తర్వాతి మ్యాచ్‌ని ఏప్రిల్ 22న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 25న ముంబై ఇండియన్స్‌తో తలబడుతుంది గుజరాత్ టైటాన్స్..