- Home
- Sports
- Cricket
- గుజరాత్ టైటాన్స్ ట్రంప్ కార్డు అతనే! రషీద్ ఖాన్‌ని కరెక్టుగా వాడుకుంటే... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...
గుజరాత్ టైటాన్స్ ట్రంప్ కార్డు అతనే! రషీద్ ఖాన్‌ని కరెక్టుగా వాడుకుంటే... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...
ఐపీఎల్ 2023 సీజన్ గ్రూప్ స్టేజీలో 14 మ్యాచుల్లో 10 విజయాలతో టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కి వచ్చింది గుజరాత్ టైటాన్స్. గత సీజన్‌లో మొదటి క్వాలిఫైయర్ గెలిచి నేరుగా ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్, ఈసారి కూడా అదే సీన్ రిపీట్ చేయాలని ఆశపడుతోంది..
- FB
- TW
- Linkdin
Follow Us
)
PTI Photo/Kunal Patil)(PTI05_12_2023_000262B)
ఐపీఎల్‌లో ఇప్పటిదాకా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మూడు మ్యాచుల్లోనూ గెలిచిన గుజరాత్ టైటాన్స్, చెన్నైలో సీఎస్‌కేని ఓడిస్తే... సొంత మైదానంలో ఫైనల్ ఆడుతుంది...
‘గుజరాత్ టైటాన్స్‌కి రషీద్ ఖాన్ ట్రంప్ కార్డు అవుతాడు. వికెట్లు కావాలనుకుంటే అతన్ని తీసుకొస్తే చాలు. హార్ధిక్ పాండ్యా, రషీద్‌ని వాడినట్టు ఐపీఎల్‌లో మిగిలిన ఏ కెప్టెన్లు వాడలేదనుకుంటా..
Image credit: PTI
రషీద్ ఖాన్‌కి భాగస్వామ్యాలు విడదీయడం చాలా ఇష్టం.ఈ సీజన్‌లో ఇప్పటికే మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒకడు.. క్వాలిఫైయర్‌లో కూడా రషీద్ ఖాన్ పర్ఫామెన్సే ఫైనల్ చేరే టీమ్‌ని డిసైడ్ చేస్తుందని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...
Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్‌లో 14 మ్యాచుల్లో 24 వికెట్లు తీసిన రషీద్ ఖాన్, మహ్మద్ షమీతో కలిసి పర్పుల్ క్యాప్ రేసులో సంయుక్తంగా టాప్‌లో ఉన్నాడు. మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ ఇద్దరూ కూడా ఒకే టీమ్ నుంచి 48 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లో నిలవడం ఇదే తొలిసారి...
Gujarat Titans
చెన్నై సూపర్ కింగ్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ తుషార్ దేశ్‌పాండే 14 మ్యాచుల్లో 20 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో టాప్ 3లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి రీఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ 11 మ్యాచుల్లో 17 వికెట్లు తీశాడు...