- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ అవ్వగానే దాన్ని మరిచిపో! లేదంటే... కుల్దీప్ యాదవ్‌కి సచిన్ టెండూల్కర్ సలహా...
ఐపీఎల్ అవ్వగానే దాన్ని మరిచిపో! లేదంటే... కుల్దీప్ యాదవ్‌కి సచిన్ టెండూల్కర్ సలహా...
ఐపీఎల్ 2022 సీజన్‌లో 21 వికెట్లు తీసి అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, ఈసారి 14 మ్యాచుల్లో 10 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. కుల్దీప్ యాదవ్ ఫెయిల్యూర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది...

Image credit: PTI
2012లో ముంబై ఇండియన్స్‌లో ఐపీఎల్ కెరీర్ మొదలెట్టిన కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత 8 సీజన్ల పాటు కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కి ఆడాడు. 2022 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉంటున్నాడు కుల్దీప్ యాదవ్...
Image credit: PTI
‘2012లో ఆస్ట్రేలియాలో సిరీస్ ఆడాం. ఆ సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్‌కి వచ్చాను. అక్కడ నేను పెద్దగా వికెట్లు తీయలేకపోయాను. ఆ సాయంత్రం నేను సచిన్ పాజీకి బౌలింగ్ చేశాను. ఆ ప్రాక్టీస్ సెషన్స్‌లో నేను సచిన్‌ని బౌల్డ్ చేశా...
Image credit: PTI
ఆ రోజు సచిన్ నాతో గంటసేపు మాట్లాడారు. అప్పటికి నేను ఇంకా చాలా చిన్న పిల్లాడిని. ఇంకా మానసిక పరిణతి కూడా రాలేదు. అప్పుడు సచిన్‌తో ఆస్ట్రేలియా సిరీస్ గురించి చెప్పాను. ఆయన నాతో చాలా విషయాలు చెప్పారు...
Kuldeep Yadav
నువ్వు ఇప్పుడే కెరీర్ మొదలెడుతున్నావ్, ఇలా ప్రతీ దానికి బాధపడుతూ కూర్చుంటే క్రికెట్‌లో రాణించడం కష్టం. నాకు చాలా సిరీసుల్లో ఇలా జరిగింది, జరుగుతూనే ఉంటుంది. ఐపీఎల్‌లోకి అవన్నీ తేకూడదు, ఐపీఎల్‌లోవి అక్కడికి తీసుకెళ్లకూడదు...
Kuldeep Yadav
ఐపీఎల్ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడితే అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించలేం. కాబట్టి దాన్ని తలకు ఎక్కించుకోకు. మంచి ఫుడ్ తీసుకో, అనవసరంగా పార్టీలు, విహారాలకు వెళ్లకు... అని సచిన్ టెండూల్కర్ చెప్పారు. ఆ మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి..’ అంటూ కామెంట్ చేశాడు కుల్దీప్ యాదవ్...
Kuldeep Yadav
‘మా మొదటి ఓవర్‌సీస్ సిరీస్‌లో కుల్దీప్ యాదవ్ 17 వికెట్లు తీశాడు, నేను 16 వికెట్లు తీశాను. సౌతాఫ్రికాలో మేం ఇద్దరం కలిసి సిరీస్ గెలిపించాం. అక్కడే వీరూ భాయ్ మమ్మల్ని పిలిచి వీళ్లు కుల్-చా లేదా ఛాకు.. ఎలాగైనా పిలవండి, ఇద్దరూ సమవుజ్జీలు.. అన్నారు. అప్పటి నుంచి మాకు కుల్ చా అనే పేరు సెటిల్ అయిపోయింది...’ అంటూ కామెంట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్