- Home
- Sports
- Cricket
- ఆ రాత్రి ధోనీ చిన్నపిల్లాడిలా ఏడవడం చూశా! చెన్నై టీమ్‌తో అంత ఎమోషన్... - హర్భజన్ సింగ్
ఆ రాత్రి ధోనీ చిన్నపిల్లాడిలా ఏడవడం చూశా! చెన్నై టీమ్‌తో అంత ఎమోషన్... - హర్భజన్ సింగ్
ఐపీఎల్ 2008 నుంచి 16 సీజన్లుగా సారథిగా కొనసాగుతున్న వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. సీఎస్‌కే కెప్టెన్‌గా నాలుగు సార్లు టైటిల్ గెలిచిన మాహీ, 2023 సీజన్‌తో రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది...
- FB
- TW
- Linkdin
Follow Us
)
టీమిండియా కెప్టెన్‌గా బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో సీఎస్‌కే టీమ్‌కి దక్కుతున్న ఆదరణకి ఇదే కారణం...
Dhoni-Harbhajan Singh
‘ఈ కథ కచ్చితంగా చెప్పి తీరాలి. 2018లో రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. టీమ్ డిన్నర్‌కి వెళ్లాం. నేను మగాళ్లు ఎప్పుడూ ఏడవరని చాలా సార్లు విన్నాను. అయితే ఆ రోజు ధోనీ చిన్నపిల్లాడిలా ఏడవడం చూశా...
మాహీ చాలా ఎమోషనల్ అయ్యాడు. సీఎస్‌కే గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవ్వరికీ ఈ విషయం తెలీదు. నేను, ఇమ్రాన్ తాహీర్ మాత్రమే అక్కడ ఉన్నాం...’ అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టాడు సీఎస్‌కే మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...
‘అవును, నేను కూడా అక్కడే ఉన్నా. ధోనీకి అది చాలా ఎమోషనల్ మూమెంట్. మాహీకి అంతకుముందు ఎప్పుడూ అలా చూడలేదు. అతని మనసుకి ఈ టీమ్ ఎంత దగ్గరైందో చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ ఉదాహరణ. ఈ టీమ్‌ని తన కుటుంబంగా భావిస్తున్నాడు...
Tahir -bhajji
మాహీకి మాత్రమే కాదు, అందరికీ అదో ఎమోషనల్ మూమెంట్. రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి వచ్చి టైటిల్ గెలిచాం. మా టీమ్‌ని అందరూ నన్ను బుడ్డే (ముసలోడు) అనేవాడు. ఆ టైటిల్‌లో నా వంతు పాత్ర పోషించడం గర్వంగా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే మాజీ క్రికెటర్ ఇమ్రాన్ తాహీర్...