MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ కోహ్లీ గుండెల్లో ఏదో మంట ఉంది! అది అస్సలు మంచిది కాదు... షేన్ వాట్సన్ కామెంట్...

విరాట్ కోహ్లీ గుండెల్లో ఏదో మంట ఉంది! అది అస్సలు మంచిది కాదు... షేన్ వాట్సన్ కామెంట్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో వ్యవహరించిన విధానం హాట్ టాపిక్ అయ్యింది. గంగూలీ వైపు కళ్లు ఉరిమి చూస్తూ బెదిరించడానికి ప్రయత్నించిన కోహ్లీ, మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 21 2023, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Virat Kohli vs Sourav Ganguly

Virat Kohli vs Sourav Ganguly

బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ విషయంలో వ్యవహరించిన విధానం, బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టిన నిజాలు, భారత మీడియాలో సెన్సేషన్ సృష్టించాయి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
kohli ganguly

kohli ganguly

అయితే తవ్వుకుంటే పోయేది భారత క్రికెట్ పరువేననే ఉద్దేశంతో విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ గొడవని మీడియా పెద్దగా పట్టించుకోలేదు. అయితే విరాట్ మాత్రం తనకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే రగిలో పోతున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌- ఆర్‌సీబీ మ్యాచ్‌లో ప్రత్యక్షంగా కనిపించింది..

37

సౌరవ్ గంగూలీతో హ్యాండ్ షేక్ చేయాల్సిందిగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కోరినా కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు విరాట్ కోహ్లీ. తాజాగా ఈ సంఘటనపై స్పందించాడు ఆ టీమ్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్...
 

47
Virat Kohli Sourav Ganguly

Virat Kohli Sourav Ganguly

‘నేను ఏదేదో రూమర్స్ వింటున్నా. నాకైతే ఏం జరిగిందో స్పష్టంగా తెలీదు. నా సంబంధం లేని విషయం కాబట్టి అందులో నేను కలుగచేసుకోదలుచుకోలేదు. అయితే విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ చూస్తే మాత్రం అతని గుండెల్లో మంట... అగ్ని దావంలా రగులుతున్నట్టు అనిపించింది...

57

అయితే ప్రత్యర్థి టీమ్‌కి అది ఏ మాత్రం మంచిది కాదు. విరాట్ కోహ్లీ మామూలుగా ఉంటేనే ప్రత్యర్థిని డామినేట్ చేస్తాడు, అలాంటిది ఇలా ఉంటే మాత్రం అతని బెస్ట్ బయటికి వచ్చేస్తుంది. దాన్ని ఆపడం చాలా కష్టం...’ అంటూ కామెంట్ చేశాడు షేన్ వాట్సన్...
 

67

సౌరవ్ గంగూలీని బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బోర్డు, రోజర్ భిన్నీకి గత ఏడాది అక్టోబర్‌లో బాథ్యతలు అప్పగించింది. దీంతో గంగూలీ తిరిగి, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. మొదటి 5 మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ, కేకేఆర్‌ని ఓడించి బోణీ కొట్టింది.. 
 

77

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ తర్వాత ఇన్‌స్టాలో సౌరవ్ గంగూలీని అన్‌ఫాలో చేశాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాతిరోజు సౌరవ్ గంగూలీ కూడా విరాట్ కోహ్లీని అన్‌ఫాలో చేశాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియా బంధం తెగిపోయింది. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Kavya Maran: గుండె పగిలిన ఆరెంజ్ ఆర్మీ.. కావ్య పాప గ్రౌండ్ లోనే ఏడ్చేసింది.. వీడియో వైరల్
Recommended image2
IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
Recommended image3
IPL : ఐపీఎల్ 2026 కప్పు ఆర్సీబీదేనా? లేదా మళ్లీ హైదరాబాద్ అడ్డుపడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved