- Home
- Sports
- Cricket
- ఒక్కో డాట్ బాల్‌కి 500 మొక్కలు నాటనున్న బీసీసీఐ... ప్లేఆఫ్స్‌లో భారత క్రికెట్ బోర్డు గొప్ప నిర్ణయం..
ఒక్కో డాట్ బాల్‌కి 500 మొక్కలు నాటనున్న బీసీసీఐ... ప్లేఆఫ్స్‌లో భారత క్రికెట్ బోర్డు గొప్ప నిర్ణయం..
ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌కి గుజరాత్, లక్నో వంటి కొత్త టీమ్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వంటి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్స్ చేరుకోవడంతో అంచనాలకు ఆకాశాన్ని తాకాయి...
- FB
- TW
- Linkdin
Follow Us
)
Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్‌లో లీగ్ స్టేజీలో మెజారిటీ మ్యాచులు ఉత్కంఠభరితంగా ఆఖరి ఓవర్ వరకూ సాగాయి. ట్విస్టుల్లు, హై డ్రామా, ఊహించని రిజల్ట్స్ రావడంతో వన్ ఆఫ్ ది బెస్ట్ ఐపీఎల్ సీజన్‌గా గుర్తింపు తెచ్చుకుంది 2023 సీజన్...
2023 సీజన్ ప్లేఆఫ్స్‌ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మొదటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్, రెండో క్వాలిఫైయర్, ఫైనల్... ప్లేఆఫ్స్‌లో బ్యాటర్లు ఆడే ఒక్కో డాట్ బాల్‌కి, 500 మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
PTI Photo/R Senthil Kumar)(PTI05_10_2023_000319B)
అంటే ఒక్క మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 50 డాట్ బాల్స్ వస్తే, ఒక్కో డాట్‌కి 500 మొక్కల చొప్పున 25 వేల మొక్కలు నాటబోతోంది బీసీసీఐ. ఇలా నాలుగు మ్యాచుల్లో 200 డాట్ బాల్స్ పడితే మొత్తంగా లక్ష మొక్కలను దేశవ్యాప్తంగా నాటుతారు..
PTI Photo/Shailendra Bhojak)(PTI05_21_2023_000436B)
ఐపీఎల్ 2023 సీజన్ మొదటి ఎలిమినేటర్‌లో తొలి డాట్ పడగానే మొక్క బొమ్మను స్కోర్‌బోర్డు మీద చూపించారు. ఇలా డాట్ బాల్స్ పెరిగే కొద్దీ నాటబోయే మొక్కల లెక్యను స్కోర్‌బోర్డుపైన చూపిస్తారు...
గత సీజన్‌లో ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్ జట్టు, 2022 సీజన్ తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మొక్కలను నాటింది. ఇప్పుడు బీసీసీఐ ఈ గొప్ప నిర్ణయం తీసుకోవడానికి కూడా రాజస్థాన్ రాయల్స్ ఆలోచనే కారణమని సమాచారం.