- Home
- Sports
- Cricket
- పంజాబ్ కింగ్స్ పనైపోయినట్టేనా! కెప్టెన్లను మార్చినా, జెర్సీ మార్చినా ప్రీతి జింటా టీమ్‌కి...
పంజాబ్ కింగ్స్ పనైపోయినట్టేనా! కెప్టెన్లను మార్చినా, జెర్సీ మార్చినా ప్రీతి జింటా టీమ్‌కి...
పంజాబ్ కింగ్స్... ఐపీఎల్ 15 సీజన్లు నడిస్తే, ఏకంగా 14 మంది కెప్టెన్లను మార్చిన టీమ్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మంది కెప్టెన్లను మార్చిన టీమ్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్, కేవలం రెండు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగలిగింది...

ఐపీఎల్ 2008 సీజన్‌లో యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో ప్లేఆఫ్స్ చేర్చిన పంజాబ్ కింగ్స్, క్వాలిఫైయర్‌లో ఓడి మూడో స్థానంతో సరిపెట్టుకుంది...
2014 సీజన్‌లో జార్జ్ బెయిలీ కెప్టెన్సీలో ఊహించని పర్ఫామెన్స్ ఇచ్చింది పంజాబ్ కింగ్స్ వురఫ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్. టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్ చేరిన పంజాబ్ కింగ్స్, సీఎస్‌కేని ఓడించి ఫైనల్ చేరింది...
కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఓడిన పంజాబ్ కింగ్స్... ఆ తర్వాత గత 8 సీజన్లలో కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది...
2015 నుంచి 2021 వరకూ రెండు సార్లు 8వ స్థానంలో, మూడు సార్లు ఆరో స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్, 2017లో 5వ స్థానంలో, 2018లో 7వ స్థానంలో నిలిచింది...
కెప్టెన్లను మార్చినా, జెర్సీ రంగు మార్చినా... ఆఖరికి టీమ్ పేరు మార్చినా ప్రీతి జింటా టీమ్‌కి లక్ మాత్రం కలిసి రావడం లేదు. ఈ సారి కూడా సీన్ మారేలా కనిపించడం లేదు...
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 115 పరుగుల ఆలౌట్ అయిన పంజాబ్ కింగ్స్, ఐపీఎల్ 2022 సీజన్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. అయితే ఈ పరాజయం తర్వాత పంజాబ్ కమ్‌బ్యాక్ ఇవ్వగలదా? అనేది అనుమానంగా మారింది...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో భనుక రాజపక్ష, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఓడియన్ స్మిత్, జానీ బెయిర్ స్టో, కగిసో రబాడా, సందీప్ శర్మ, నాథన్ ఎల్లీస్, రాహుల్ చాహార్ వంటి స్టార్లను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...
లివింగ్‌స్టోన్ ఇప్పటికే సీజన్‌లో 3 హాఫ్ సెంచరీలు నమోదు చేసినా, రాజపక్ష మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నా పంజాబ్ రాతను మాత్రం మార్చలేకపోతున్నారు...
‘ఈ పరాజయం పంజాబ్ కింగ్స్ టీమ్‌పై తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. 115 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా కష్టమే...’ అంటూ కామెంట్ చేశాడు ఆ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్..
2020 సీజన్ వరకూ స్టేడియానికి వచ్చి పంజాబ్ టీమ్‌ని ఎంకరేజ్ చేసేది ప్రీతి జింటా. తాను వస్తే లక్ కలిసి రావడం లేదేమోనని ఇప్పుడు స్టేడియంలో ఈ సొట్టబుగ్గల సుందరి కనిపించడం లేదు.. అయినా పంజాబ్ టీమ్‌ని అదృష్టం వరించడం లేదు.