టీమిండియా ఓటమికి అసలు కారణం ఆయనే... ప్రధాని మోదీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...
క్రికెట్‌లో రాజకీయాలు జరగొచ్చు కానీ, రాజకీయాల్లో క్రికెట్ ఆడడం సాధ్యం కాదు. క్రికెటర్ల పర్ఫామెన్స్‌కీ, దేశరాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమికి ప్రధాని మోదీ కారణమంటూ ట్రోల్స్ వినిపిస్తున్నాయి...

2014, మే 26న భారతదేశానికి 14వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు నరేంద్ర మోదీ. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది...

అయితే యాదృచ్ఛికమో లేక బ్యాడ్ లక్ పట్టిందో తెలీదు కానీ 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న సమయం నుంచి టీమిండియా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయింది...

చివరిగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్న భారత జట్టు, ఆ తర్వాత ఆరు ఐసీసీ టోర్నీల్లో టైటిల్ గెలవలేకపోయింది.. దీంతో భారత జట్టు బ్యాడ్‌లక్‌కి మోదీయే కారణమంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత జట్టు, శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాతి ఏడాది 2015లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడింది...

2016 టీ20 వరల్డ్‌కప్ సెమీ ఫైనల్‌లో ఓడిన భారత జట్టు, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో చిత్తుగా ఓడింది...

2019 వన్డే వరల్డ్‌కప్ గ్రూప్ స్టేజ్‌లో వరుస విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 18 పరుగుల తేడాతో ఓడింది...

2021 ఐసీసీ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచి ఫైనల్ చేరిన భారత జట్టు, ఫైనల్‌లో ఓడి మరోసారి ఐసీసీ టైటిల్‌కి అడుగు దూరంలో నిలిచిపోయింది.

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అధికారంలో ఉన్న సమయంలో భారత జట్టు (2007 టీ20, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ) మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిందని, మోదీ అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా గెలవలేకపోయిందని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

అయితే మోదీ అధికారంలోకి వచ్చాక టీమిండియా ఎప్పుడూ లేనట్టుగా ఆరు ఐసీసీ టోర్నీల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిందని, మూడు టోర్నీల్లో ఫైనల్, మరో మూడు టోర్నీల్లో సెమీస్ చేరిందని అంటున్నారు నమో అభిమానులు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన 2007 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు, గ్రూప్ స్టేజ్‌లోనే బంగ్లాదేశ్‌తో ఓడి.. ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని కామెంట్ చేస్తున్నారు.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమి, విరాట్ కోహ్లీపై ట్రోలింగ్ రావడానికి కారణమైందని అందరూ ముందుగానే అంచనా వేసినా, ప్రధాని మోదీకి కూడా ఈ ఎఫెక్ట్ ప్రభావం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.