- Home
- Sports
- Cricket
- భారత్‌లో ఉన్న ముస్లింలు మాకే సపోర్ట్ చేస్తారు! ఇంతకుముందు చేశారు కూడా... పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కామెంట్స్..
భారత్‌లో ఉన్న ముస్లింలు మాకే సపోర్ట్ చేస్తారు! ఇంతకుముందు చేశారు కూడా... పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కామెంట్స్..
ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు, ఇరుదేశాల మధ్య ఓ యుద్ధ వాతావరణం నెలకొనేది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ క్రికెటర్ రాణా నవీద్ ఉల్ హసన్..

‘ఇండియాలో మ్యాచ్ జరిగితే మేం సిక్సర్ కొట్టినా, ఫోర్ కొట్టినా ఎవ్వరూ చప్పట్లు కొట్టరు, ఏ మాత్రం సపోర్ట్ ఉండదు... ’ అంటూ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ కామెంట్లు చేసిన కొన్ని గంటలకే రాణా నవీద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు..
India vs Pakistan
‘ఇండియాలో మ్యాచ్ జరిగితే కచ్చితంగా టీమిండియానే ఫెవరెట్‌గా ఉంటుంది. అయితే పాకిస్తాన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. టీమిండియాకి అక్కడ ప్రేక్షకుల సపోర్ట్ ఉండొచ్చు కానీ భారత్‌లో ఉన్న ముస్లింలు చాలా మంది, పాకిస్తాన్‌కే సపోర్ట్ చేస్తారు..
India vs Pakistan Last Over
భారత ముస్లింలు, పాకిస్తాన్‌కి ఇంతకుముందు చాలా సార్లు సపోర్ట్ చేశారు. ఇండియాలో జరిగే మ్యాచులకు పాక్ జెండాలత వచ్చేవాళ్లు. నేను ఇండియాలో రెండు సిరీస్‌లు ఆడాను. అహ్మదాబాద్‌లో, హైదరాబాద్‌లో చాలామంది భారత ముస్లింలు, పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా ఉంటారు..
మేం అక్కడ ఇండియన్ క్రికెట్ లీగ్ ఆడాం. ఇంజమామ్ భాయ్ కెప్టెన్‌గా ఉన్నాడు. హైదరాబాద్‌లో మాకు చాలా సపోర్ట్ దక్కింది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చాలా టీమ్స్ కంటే మేం స్ట్రాంగ్ టీమ్‌గా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మాకు సపోర్ట్ ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు నవీద్ ఉల్ హసన్..
పాకిస్తాన్ తరుపున 7 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన నవీద్ ఉల్ హసన్, టీమిండియాతో 18 మ్యాచులు ఆడాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా అక్టోబర్ 6న హైదరాబాద్‌లో నెదర్లాండ్స్‌తో మ్యాచులు ఆడే పాకిస్తాన్, ఇక్కడే అక్టోబర్ 12న శ్రీలంకతో మ్యాచ్ ఆడనుంది.