- Home
- Sports
- Cricket
- ప్యాట్ కమ్మిన్స్ ఇచ్చాడు, మనవాళ్లు ఏం ఇవ్వలేదా? భారత క్రికెటర్లు ఎంతెంత ఇచ్చారంటే...
ప్యాట్ కమ్మిన్స్ ఇచ్చాడు, మనవాళ్లు ఏం ఇవ్వలేదా? భారత క్రికెటర్లు ఎంతెంత ఇచ్చారంటే...
ఎవరైనా సాయం చేస్తే, అతని గురించి కాకుండా చేయనివారి గురించి టార్గెట్ చేయడం నేటి యువతకు బాగా అలవాటు. అందుకే ప్యాట్ కమ్మిన్స్ చేసిన సాయం, భారత క్రికెటర్లపై ట్రోలింగ్‌కి కారణమైంది...మరి మనవాళ్లు కరోనా నియంత్రణ కోసం ఏ సాయం చేయలేదా?

ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్, దేశంలో సెకండ్ వేవ్ కరోనా నియంత్రణకి, ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు కోసం ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు 37 లక్షల రూపాయలు) విరాళంగా ఇచ్చాడు. దీంతో ఆసీస్ క్రికెటర్లు విరాళం ఇచ్చాడు, భారత క్రికెటర్లు ఏం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ మొదలైంది.

వాస్తవానికి గత ఏడాది ఐపీఎల్ వేలంలో రూ.15 కోట్ల 50 లక్షల డాలర్లు పారితోషికంగా అందుకున్న ప్యాట్ కమ్మిన్స్, నేడు ఆక్సిజన్ సిలిండర్ల కోసం 50 వేల డాలర్లు విరాళంగా ఇస్తే, అతని కంటే చాలాముందే భారత క్రికెటర్లు కూడా స్పందించారు.

గౌతమ్ గంభీర్: భారత మాజీ క్రికెటర్, పార్లమెంట్ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్, కరోనా నియంత్రణ కోసం ప్రధాని సహాయ నిధికి రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించాడు. దీనితో పాటు తన రెండేళ్ల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు.

రోహిత్ శర్మ: భారత క్రికెటర్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ, కరోనా నియంత్రణ కోసం ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.80 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ: భారత సారథి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మతో కలిసి ప్రధానమంత్రి సహాయనిధికి విరాళం అందించారు. అయితే ఎంత విరాళం ఇచ్చింది తెలియచేయలేదు.

సచిన్ టెండూల్కర్: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కరోనా నియంత్రణ కోసం ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళంగా అందచేశాడు.

సౌరవ్ గంగూలీ: భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ప్రధాని సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళంగా అందచేస్తున్నట్టు ప్రకటించాడు.

సురేశ్ రైనా: భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేశ్ రైనా, కరోనా నియంత్రణ కోసం రూ.52 లక్షలు విరాళంగా అందచేశాడు.

శిఖర్ ధావన్: భారత క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ కూడా ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాన్ని అందచేశాడు. అయితే గబ్బర్ కూడా ఎంత సాయం చేసింది ప్రకటించలేదు.

మిథాలీరాజ్: భారత మహిళా క్రికెటర్, వన్డే టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్ కూడా ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల రూపాయలు విరాళంగా అందచేసింది.

వీరితో పాటు భారత క్రికెట్ బోర్డు, ఏకంగా రూ.51 కోట్ల రూపాయలను ప్రధాని సహాయ నిధికి విరాళంగా ఇచ్చింది. ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి క్రికెటర్లు కూడా కరోనా నియంత్రణ కోసం ప్రధానమంత్రి సహాయ నిధికి తమవంతు సాయం చేశారు.