క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
Rohit Sharma breaks Chris Gayle's record: కటక్ లో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇదే క్రమంలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు.

rohit sharma gayle
Most sixes by players in ODI cricket: టీ20 సిరీస్ లో అద్భుతమైన ఆటతో అదరగొట్టిన భారత్.. వన్డే సిరీస్ లో కూడా ఇంగ్లాండ్ కు చుక్కలు చూపిస్తోంది. తొలి వన్డే విక్టరీ జోరును కటక్ లో జరిగిన రెండో వన్డేలో కూడా చూపించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో పాటు గిల్, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్ లు బ్యాట్ తో రాణించడంతో టీమిండియా విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెస్టిండీస్ మాజీ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు.
Image Credit: ANI
సెంచరీతో పరుగుల సునామీ సృష్టించిన రోహిత్ శర్మ
తొలి వన్డేలో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ.. కటక్ లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో మాత్రం దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లు బాదాడూ ఇంగ్లాండ్ బౌలింగ్ ను చిత్తుచేశాడు. రెండో ఓవర్‌లో గస్ అట్కిన్సన్ బౌలింగ్ తన ఫ్లిక్ షాట్ తో సిక్సర్ కొట్టాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.
రోహిత్ శర్మ ఇప్పటివరకు 331 సిక్సర్లతో వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మన్ గేల్ తో సమానంగా ఉన్నాడు. అయితే, కటక్ మ్యాచ్‌లో తన మొదటి సిక్సర్‌తో ఆ మార్కును అధిగమించి అత్యధిక వన్డే సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో షాహిద్ అఫ్రిది అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు బాదాడు.
వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 ఆటగాళ్ళు వీరే
1 - క్రిస్ గేల్: 398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు
2 - రోహిత్ శర్మ: 267 మ్యాచ్‌ల్లో 338* సిక్సర్లు
3 - క్రిస్ గేల్: 301 మ్యాచ్‌ల్లో 331 సిక్సర్లు
4 - సనత్ జయసూర్య: 445 మ్యాచ్‌ల్లో 270 సిక్సర్లు
5 - ఎంఎస్ ధోని : 350 మ్యాచ్‌ల్లో 229 సిక్సర్లు
Rohit Sharma
మ్యాచ్ ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేసిన రోహిత్ శర్మ
చాలా కాలంగా ఫామ్ లేకుండా ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ ఈ మ్యాక్ తో తిరిగి ఫామ్ ను అందుకున్నాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే మంచి టచ్ లో కనిపించాడు. తన అద్భుతమైన ఫోర్లు, సిక్సర్లు బాదాడు.
మొదటి ఆరు ఓవర్లలో రోహిత్ వెంటనే రెండు బంతులను భారీ సిక్సర్లు గా మలిచాడు. తన తదుపరి ఓవర్‌లో లాంగ్-ఆఫ్ ఓవర్‌కు భారీ సిక్సర్ కొట్టాడు. తన సెంచరీ ఇన్నింగ్స్ (119 పరుగులు) లో రోహిత్ శర్మ 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు.
Image Credit: ANI
సిరీస్ కైవసం చేసుకున్న భారత్
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 304 పరుగులు చేసింది. బెన్ డకెట్ 65 పరుగులతో వారికి బలమైన ఆరంభాన్ని అందించాడు, ఆ తర్వాత జో రూట్ 69 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. చివరికి లియామ్ లివింగ్‌స్టోన్ (41) ఇన్నింగ్స్ తో జట్టు స్కోరును 304కు చేర్చాడు.
305 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు అద్భుతమైన ఆరంభం లభించింది. రోహిత్, గిల్ అదరగొట్టారు. రోహిత్ శర్మ సెంచరీ, గిల్ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ లతో భారత్ ఈజీగానే విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ 119 పరుగులు, గిల్ 60 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 44, అక్షర్ పటేల్ 41 పరుగులు చేయడంతో భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 44.3 ఓవర్లలో 308 పరుగులు చేసి విక్టరీ అందుకుంది.