- Home
- Sports
- Cricket
- అక్తర్ రికార్డుకే ఎసరు పెట్టిన ఉమ్రాన్ మాలిక్... ప్రాక్టీస్ సెషన్‌లో వేసిన బంతి మ్యాచ్‌లో పడితే...
అక్తర్ రికార్డుకే ఎసరు పెట్టిన ఉమ్రాన్ మాలిక్... ప్రాక్టీస్ సెషన్‌లో వేసిన బంతి మ్యాచ్‌లో పడితే...
ఐపీఎల్ 2022 సీజన్ ఉమ్రాన్ మాలిక్ కెరీర్‌నే మార్చేసింది. ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాకి ఎంపికైన ఈ జమ్మూ కశ్మీర్ కుర్రాడు... తొలి మ్యాచ్ కోసం ప్రాక్టీస్ సెషన్స్‌లో తెగ శ్రమిస్తున్నారు. నెట్స్‌లో ఉమ్రాన్ మాలిక్ వేసిన ఓ బంతి 163.7 కి.మీ.ల వేగాన్ని టచ్ చేసింది...

ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకూ 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ విసిరిన 161.3 కి.మీ.ల వేగంతో వేసిన బంతి... అత్యంత వేగవంతమైన డెలివరీగా నమోదైంది... దాదాపు ఈ టోర్నీ జరిగిన 20 ఏళ్లు కావస్తున్నా, అక్తర్ రికార్డును ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు...
టీమిండియాలోకి మెరుపు వేగంతో దూసుకొచ్చిన ఉమ్రాన్ మాలిక్, సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కి ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ నెట్ సెషన్స్‌లో ఉమ్రాన్ మాలిక్ వేసిన ఓ బంతి ఏకంగా 163.7 కి.మీ.ల వేగాన్ని టచ్ చేసింది...
Image credit: PTI
ప్రాక్టీస్ సెషన్స్‌లో వేసిన బంతి, మ్యాచ్‌లో పడితే షోయబ్ అక్తర్ 20 ఏళ్లుగా దాచుకున్న రికార్డును ఈడ్చి తన్ని అవతల పడేసి, సరికొత్త మైలురాయిని సెట్ చేస్తాడు ఉమ్రాన్ మాలిక్...
Rahul Dravid , Umran Malik
ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ ఆరంభానికి ముందు టి నటరాజన్ కరోనా బారిన పడి, జట్టుకి దూరం కావడంతో అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు ఉమ్రాన్ మాలిక్...
ఆ సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే 150 కి.మీ.ల వేగంతో బంతులు విసురుతూ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్‌ని రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...
Image credit: PTI
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తున్నా వికెట్లు తీయలేకపోయిన ఉమ్రాన్ మాలిక్, ఆ తర్వాత వికెట్ల వేటలోనూ సక్సెస్ అయ్యాడు. 14 మ్యాచుల్లో 22 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్, ఓ మ్యాచ్‌లో నాలుగు, మరో మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి... 14 మ్యాచుల్లో ‘ఫాసెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు దక్కించుకున్నాడు..
Image credit: PTI
సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో ఉమ్రాన్ మాలిక్ పర్పామెన్స్‌ని బట్టి, అతనికి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే జట్టులో చోటు కల్పించాలనే విషయాన్ని తేల్చబోతున్నారు సెలక్టర్లు. అతను అంతర్జాతీయ క్రికెట్‌లోనూ, ఐపీఎల్‌లో చూపించిన పర్పామెన్స్ చూపిస్తే... మాలిక్‌కి పొట్టి ప్రపంచకప్ ఆడే అవకాశం రావడం గ్యారెంటీ...