- Home
- Sports
- Cricket
- అతనేం చేయాలో కోచ్‌లు చెప్పాల్సిన అవసరం లేదు... హర్ధిక్ పాండ్యాపై ఆసీస్ దిగ్గజ బౌలర్...
అతనేం చేయాలో కోచ్‌లు చెప్పాల్సిన అవసరం లేదు... హర్ధిక్ పాండ్యాపై ఆసీస్ దిగ్గజ బౌలర్...
వెన్నెముక సర్జరీ తర్వాత రెండేళ్ల పాటు బౌలింగ్ చేయలేకపోయిన హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ 2022 సీజన్‌లో ఘనంగా రీఎంట్రీ చాటుకున్నాడు. బ్యాటుతో, బాల్‌తో మాత్రమే కాకుండా కెప్టెన్‌గానూ అదరగొట్టిన హార్ధిక్ పాండ్యా.. గుజరాత్ టైటాన్స్‌కి తొలి సీజన్‌లోనే టైటిల్ అందించాడు...

Image credit: PTI
ఐపీఎల్ 2022 సీజన్‌లో బ్యాటింగ్‌లో 487 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, బౌలింగ్‌లో 8 వికెట్లు తీశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’ గెలిచాడు...
Image credit: PTI
అయితే సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో మాత్రం హార్ధిక్ పాండ్యా నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రావడం లేదు. తొలి మ్యాచ్‌లో ఒకే ఓవర్ బౌలింగ్ వేసి 18 పరుగులు ఇచ్చిన పాండ్యా, రెండో మ్యాచ్‌లో 3 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చాడు. మూడో టీ20లో బౌలింగ్ వేయలేదు...
‘హార్ధిక్ పాండ్యాకి ఇప్పటికే చాలా అనుభవం ఉంది. ఫామ్‌లోకి రావడానికి, వికెట్లు తీయడానికి ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. ఏం చేయాలో కోచ్‌లు చెప్పాల్సిన అవసరం లేదు...
ఎందుకంటే హర్ధిక్ పాండ్యా ఓ క్వాలిటీ ఆల్‌రౌండర్, క్వాలిటీ హిట్టర్. చాలా మంది కోచ్‌లు వేగంగా బంతులు వేస్తేనే వికెట్లు వస్తాయని అనుకుంటారు. అయితే వేగంగా పరుగెత్తుతూ వచ్చి, వేగంగా బాల్ వేసినంత మాత్రన రిజల్ట్ రాదు..
Image credit: PTI
బౌలింగ్ యాక్షన్, సరైన ఏరియాల్లో బౌలింగ్ వేయడంతో పాటు ప్రెషర్‌ని నిర్మించడం, వికెట్లు తీయడం కూడా చాలా అవసరం... ఈ విషయాలన్నీ హార్ధిక్ పాండ్యాకి బాగా తెలుసు..
Photo source- iplt20.com
భువనేశ్వర్ కుమార్ క్వాలిటీ ప్లేయర్. అతను టచ్‌లోకి వస్తే మ్యాచ్‌నే కంట్రోల్ చేయగలడు. అతని దగ్గర కావాల్సినంత అనుభవం ఉంది..’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్..
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఒక్క బాల్ కూడా వేయలేకపోయినా మెంటర్ ఎమ్మెస్ ధోనీ సిఫారసుతో టీ20 వరల్డ్ కప్ ఆడిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు హార్ధిక్...