- Home
- Sports
- Cricket
- అన్నకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న హార్ధిక్ పాండ్యా... మూడేళ్ల తర్వాత దినేశ్ కార్తీక్‌కి...
అన్నకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న హార్ధిక్ పాండ్యా... మూడేళ్ల తర్వాత దినేశ్ కార్తీక్‌కి...
ఐపీఎల్ 2022 సీజన్‌లో పవర్ హిట్టింగ్‌తో ఆర్‌సీబీకి మ్యాచ్ ఫినిషర్‌గా నిరూపించుకున్నాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. ఐపీఎల్ పర్పామెన్స్ కారణంగా సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపికైన దినేశ్ కార్తీక్‌కి ఆఖరి ఓవర్‌లో ఊహించని అవమానం ఎదురైంది...

ఆన్రీచ్ నోకియా వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ మొదటి బంతికి రిషబ్ పంత్ అవుట్ కావడంతో దినేశ్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులందరూ ‘డీకే... డీకే...డీకే’ అని అరుస్తూ, దినేశ్ కార్తీక్‌కి ఘన స్వాగతం పలికారు...
Dinesh Karthik
నోకియా బౌలింగ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికి పరుగులేమీ చేయలేకపోయిన దినేశ్ కార్తీక్, రెండో బంతికి 2 పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే హార్ధిక్ పాండ్యా సింగిల్‌తోనే సరిపెట్టుకోవడంతో రెండో పరుగు రాలేదు... రెండో పరుగు కోసం సగం దూరం వెళ్లిన దినేశ్ కార్తీక్, వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. ఈ సమయంలో డైరెక్ట్ హిట్ జరిగి ఉంటే కార్తీక్ రనౌట్ అయ్యేవాడే...
20వ ఓవర్ నాలుగో బంతికి సిక్సర్ బాదిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాతి బంతికి దినేశ్ కార్తీక్‌కి స్ట్రైయిక్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశం వచ్చినా, పాండ్యా స్ట్రైయిక్ రొటేట్ చేయకపోవడం హాట్ టాపిక్ అయ్యింది...
ఒకవేళ హార్ధిక్ పాండ్యా మూడో బంతికి రెండో పరుగు కోసం ప్రయత్నించి ఉంటే, దినేశ్ కార్తీక్‌కి మరో 3 బాల్స్ ఆడే అవకాశం ఉండేది. కనీసం ఐదో బంతికి సింగిల్ తీసినా ఆఖరి బాల్ ఆడేవాడు కార్తీక్. అయితే దినేశ్ కార్తీక్‌కి స్ట్రైయిక్ ఇవ్వకపోవడానికి మూడేళ్ల క్రితం జరిగిన సంఘటనే కారణమంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
2019 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన దశలో దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా క్రీజులో ఉన్నారు.
టిమ్ సౌథీ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతికి 2 పరుగులు తీసిన దినేశ్ కార్తీక్, ఆ తర్వాత రెండు బంతుల్లో కృనాల్ పాండ్యాకి స్ట్రైయిక్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీంతో మొదటి మూడు బంతుల్లో కలిపి 2 పరుగులు మాత్రమే వచ్చాయి.
చివరి 3 బంతుల్లో 14 పరుగులు కావాల్సి రాగా నాలుగో బంతికి దినేశ్ కార్తీక్ సింగిల్ తీసి కృనాల్ పాండ్యాకి స్ట్రైయిక్ ఇచ్చాడు. ఆ తర్వాతి బంతికి కృనాల్ సింగిల్ తీయగా ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్ సిక్సర్ బాదాడు.
అయినా 213 పరుగుల లక్ష్యఛేదనలో 208 పరుగులకే పరిమితమై 4 పరుగుల తేడాతో ఓడింది భారత జట్టు... ఈ మ్యాచ్‌లో అన్న కృనాల్ పాండ్యాకి స్ట్రైయిక్ ఇవ్వకుండా అవమానించిన దినేశ్ కార్తీక్‌పై బదులు తీర్చుకునేందుకు మూడేళ్లు వేచి చూసిన హార్ధిక్ పాండ్యా... సౌతాఫ్రికాతో తొలి టీ20లో ఆ ముచ్ఛట తీర్చుకున్నాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
అన్న కృనాల్ పాండ్యా అంటే హార్ధిక్ పాండ్యాకి అమితమైన అభిమానం. అందుకే కృనాల్ పాండ్యా తొలి వన్డేలో అన్నకి త్వరగా స్ట్రైయిక్ రావాలంటే గోల్డెన్ డకౌట్ అయ్యాడు హార్ధిక్ పాండ్యా... ఇప్పుడు కూడా అన్నకు జరిగిన అవమానానికి కార్తీక్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడని అంటున్నారు నెటిజన్లు...