అది సాధిస్తే టీ20 వరల్డ్ కప్‌కి రెడీ అయినట్టే... సఫారీ కెప్టెన్ తెంబ భవుమా...
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది భారత జట్టు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్లు లేకుండా స్వదేశంలో జూన్ 9 నుంచి టీ20 సిరీస్‌లో పాల్గొననుంది టీమిండియా...

ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కి టీమిండియా కెప్టెన్‌గా కెఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వ్యవహరించబోతున్నారు.. సఫారీ టూర్‌లో భారత జట్టును వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన తెంబ భవుమా, సఫారీ టీమ్‌కి వైట్ బాల్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...
ఇప్పటికే భారత్‌కి చేరుకున్న సౌతాఫ్రికా జట్టు, ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటోంది. జూన్ 5న భారత జట్టు ఆటగాళ్లు, బీసీసీఐ క్యాంపులో చేరబోతున్నారు... ఈ సందర్భంగా ఆన్‌లైన్ మీడియా సమావేశంలో పాల్గొన్న భవుమా, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..
‘భారత్‌లో పిచ్, వాతావరణ పరిస్థితులు ఆస్ట్రేలియా పరిస్థితులకి భిన్నంగా ఉంటాయి. అయితే మాకు ఇలాంటి పిచ్‌ల మీద ఆడడం చాలా అవసరం. ఎందుకంటే జట్టులో ఉన్న లోపాలను తెలుసుకునేందుకు అవకాశం దొరుకుతుంది...
భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఆటగాళ్ల పర్ఫామెన్స్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్టుకి తయారుచేసేందుకు సాహయపడుతుంది. ఎవరెవరికి ఏ రోల్ ఇస్తే బెటర్, ఎవరు ఏ పొజిషన్‌లో సెట్ అవుతారనేది డిసైడ్ చేస్తాం...
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు లేకపోయినా జట్టులో గెలవాలనే కసి మాత్రం అలాగే ఉంటుందిగా... అందులోనూ ఐపీఎల్‌లో అదరగొట్టిన వారికి ఈ సిరీస్‌లో అవకాశాలు ఇచ్చారు...
భారత జట్టు మైండ్ సెట్ గత రెండేళ్లలో చాలా మారిపోయింది. వాళ్లు గెలుపు కోసం ఏం చేయడానికి వెనుకాడడం లేదు. అందుకే వారి స్పిరిట్‌ని మేం ఓడించగలమా.. అనేది చూడాలి...
కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ వంటి టాప్ క్లాస్ స్పిన్నర్లను, అదీ వారి ప్లేస్‌లో ఎదుర్కోవడం చాలా కష్టం. వారిని ఫేస్ చేయగలిగితే, టీ20 సిరీస్ పెద్ద కష్టమేమీ కాదు...’ అంటూ చెప్పుకొచ్చాడు తెంబ భవుమా...