- Home
- Sports
- Cricket
- పొలాలను దున్ని, రన్నింగ్ ట్రాక్‌గా మార్చి... మహ్మద్ షమీ సీక్రెట్ రివీల్ చేసిన సంజయ్ బంగర్
పొలాలను దున్ని, రన్నింగ్ ట్రాక్‌గా మార్చి... మహ్మద్ షమీ సీక్రెట్ రివీల్ చేసిన సంజయ్ బంగర్
సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి, టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు మహ్మద్ షమీ. టెస్టుల్లో ఈ ఫీట్ సాధించిన ఐదో భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడుు మహ్మద్ షమీ...

ఇంతకుముందు కపిల్‌దేవ్ 50 టెస్టుల్లో, శ్రీనాథ్ 54 టెస్టుల్లో 200 టెస్టు వికెట్ల మైలురాయిని అందుకుంటే మహ్మద్ షమీ 55 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించాడు. జహీర్ ఖాన్ 63, ఇషాంత్ శర్మ 65 టెస్టుల్లో ఈ ఫీట్ అందుకున్నారు...
గత ఏడాది చివర్లో జరిగిన ఆడిలైడ్ టెస్టులో గాయపడి ఆసీస్‌తో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు మహ్మద్ షమీ. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 17వ ఓవర్‌లో 17 పరుగులు ఇవ్వడంతో షమీపై బీభత్సమైన సైబర్ దాడి జరిగింది...
అయితే ఇలాంటి ట్రోల్స్‌కి తన పర్పామెన్స్‌తోనే సమాధానం ఇస్తున్నాడు బుమ్రా. ఇంగ్లాండ్ టూర్‌లో బాల్‌తోనే కాకుండా బ్యాటుతోనూ రాణించిన మహ్మద్ షమీ... కమ్‌బ్యాక్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డాడని అంటున్నాడు మాజీ కోచ్ సంజయ్ బంగర్...
‘2016, 2017 సమయంలో మహ్మద్ షమీ ఫిట్‌నెస్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయి. తన వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు రావడంతో షమీ డిప్రెషన్‌లోకి వెళ్లాడు...
ఫిట్‌నెస్ లెవెల్స్‌ను అందుకోకపోతుండడంతో జట్టుకి ఎంపిక కాకపోవడంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు మహ్మద్ షమీ. ఆ సమయంలో తనకి యూపీలో కొన్ని వ్యవసాయ భూములు ఉండేవి...
ఫిట్‌నెస్‌పైన పూర్తి ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయిన షమీ... ఆ పొలాలను దున్ని, ఓ రన్నింగ్ ట్రాక్ నిర్మించుకున్నాడు. దానిపైనే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ, ఫిట్‌నెస్‌ను తిరిగి తెచ్చుకున్నాడు...
రీఎంట్రీ తర్వాత మహ్మద్ షమీ ఎలా బౌలింగ్ చేస్తున్నాడో అందరికీ తెలిసిందే... షమీ బౌలింగ్‌లో మ్యాజిక్ అంతా అతని రన్నింగ్‌లోనే ఉంటుంది.
ఒకవేళ ఫిట్‌గా లేకపోతే తన రన్నింగ్ తగ్గిపోతుంది. అది బంతి వేగంపై, లైన్ అండ్ లెంగ్త్‌పై ప్రభావం చూపిస్తుది. ఇప్పుడు అతని బౌలింగ్‌లో చక్కని బ్యాలెన్స్ కనిపిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు సంజయ్ బంగర్.