Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డు బద్దలుకొట్టే ఛాన్స్ మిస్సైన అభిషేక్ శర్మ
india vs england: వాంఖడే స్టేడియంలో భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ సునామీ వచ్చింది. అద్భుతమైన సెంచరీ కొట్టాడు. అయితే, తృటిలో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ కోల్పోయాడు.

IND vs ENG : అభిషేక్ శర్మ సునామీ వచ్చింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ధనాధన్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. ఫోర్లు సిక్సర్లు బాదుదూ సెంచరీ కొట్టాడు. కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. తర్వాత మరింత దూకుడు పెంచుతూ 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు బాదాడు.
Image Credit: Getty Images
ఇంగ్లాండ్ బౌలర్లపై అటాక్ మొదలుపెట్టిన అభిషేక్ శర్మ
వాంఖడే స్టేడియంలో ధనాధన్ బ్యాటింగ్ చేసిన టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు. కేవలం 37 బంతులు ఎదుర్కొని, ఈ 24 ఏళ్ల బ్యాట్స్‌మెన్ తన సెంచరీని పూర్తి చేశాడు. అతని అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఇది రెండో సెంచరీ. ఓపెనర్ కు వచ్చిన అభిషేక్ శర్మ.. ఇంగ్లండ్ బౌలర్లపై ఆరంభం నుంచే తన బ్యాట్ తో అటాక్ చేయడం మొదలుపెట్టాడు. ఆరంభం నుంచి ఫోర్లు, సిక్సర్లు బాదిన అభిషేక్ 11వ ఓవర్లో సెంచరీ పూర్తి చేశాడు.
37 బంతుల్లో అభిషేక్ శర్మ సెంచరీ
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ కు దిగిన భారత ప్లేయర్లు ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలింగ్ ను చిత్తుచేశారు. మరీ ముఖ్యంగా అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ తో సెంచరీతో చెలరేగిపోయాడు.
అభిషేక్ 10 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. తన సెంచరీని పూర్తి చేయడానికి ముందు, అతను కేవలం 17 బంతుల్లో ఫిఫ్టీ కొట్టాడు. ఇది టీ20 ఫార్మాట్‌లో భారత క్రికెట్ చరిత్రలో రెండవ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. 12 బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
రోహిత్ శర్మ రికార్డును తృటిలో మిస్ అయిన అభిషేక్ శర్మ
అభిషేక్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టడానికి దగ్గరగా వచ్చాడు. కానీ 10వ ఓవర్లో ఆదిల్ రషీద్ వేసిన కొన్ని డాట్ బాల్స్ కారణంగా అతను దానిని కోల్పోయాడు. అదే భారత ప్లేయర్ గా ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ ఫార్మాట్‌లో అభిషేక్ భారత్‌కు రెండో ఫాస్టెస్ట్ సెంచరీని కొట్టాడు. 2017 డిసెంబర్‌లో శ్రీలంకపై 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ పేరిట భారత ప్లేయర్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉంది.
Abhishek Sharma, Team India, Cricket
సూర్య కుమార్ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ
రోహిత్ శర్మ రికార్డును మిస్ అయినప్పటికీ 2022 అక్టోబర్‌లో గౌహతిలోని బర్సపరా స్టేడియంలో దక్షిణాఫ్రికాపై 18 బంతుల్లో సూర్యకుమార్ యాదవ్ కొట్టిన హాఫ్ సెంచరీ రికార్డును అభిషేక్ వర్మ అధిగమించాడు. స్వదేశంలో 17 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన భారత ప్లేయర్ గా అభిషేక్ నిలిచాడు. 2024 జూన్‌లో హ్యాపీ వ్యాలీ గ్రౌండ్‌లో సైప్రస్‌పై 27 బంతుల్లో సెంచరీ చేసిన ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఉంది.
భారత్ తరఫున టీ20 ఇంటర్నేషనల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ప్లేయర్లు వీరే
రోహిత్ శర్మ – 35 బంతులు vs శ్రీలంక, డిసెంబర్ 2017
అభిషేక్ శర్మ – 37 బంతులు vs ఇంగ్లాండ్, ఫిబ్రవరి 2025
సంజూ శాంసన్ – 40 బంతులు vs బంగ్లాదేశ్, అక్టోబర్ 2024
తిలక్ వర్మ – 41 బంతులు vs సౌతాఫ్రికా, నవంబర్ 2024
సూర్యకుమార్ యాదవ్ vs శ్రీలంక 45 బంతులు , జనవరి 2023